ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఏవి కల్తీ లేని ఆహారం అనేది గుర్తుపట్టడం చాలా కష్టము.. కాని కల్తీ లేని ఆహారం ఏదైనా ఉంది అంటే అది కొబ్బరికాయ అందులో ఉండే నీరు అని చెప్పవచ్చు. కొబ్బరి రుచిని అందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందట. ఈ కొబ్బరి తో పలు రకాల ఆహార పదార్థాలను కూడా తయారు చేసుకోవచ్చు అయితే కొబ్బరి జ్యూస్ కూడా చేసుకోవచ్చు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కొబ్బరి జ్యూస్ వల్ల ఉపయోగాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.



కొబ్బరిలో ఎక్కువగా విటమిన్స్  లభిస్తాయి అలాగే నియాసిస్, కార్బోహైడ్రేట్లు పీచు పదార్థము ఇనుము వంటివి పుష్కలంగా లభిస్తుంది. అందుచేతనే ఇవి జీర్ణ వ్యవస్థను సైతం ఆరోగ్యంగా ఉండడంలో చాలా సహాయపడతాయి ఎవరైనా అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు వీటిని అప్పుడప్పుడు తింటూ ఉండడం చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలను నియంత్రించి షుగర్ రాకుండా కాపాడుతూ ఉంటుంది. కొబ్బరికాయ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గడమే కాకుండా నీరసాన్ని కూడా దూరం చేస్తుందట. కొబ్బరినీటిని కానీ జ్యూస్ ని కానీ తరచు తాగితే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.


కొబ్బరి జ్యూస్ తయారు చేసుకోవలసిన పదార్థాలలో కొబ్బరికాయ ఒక టేబుల్ స్పూన్ చక్కెర కాస్త తేనె ఈ మూడిటిని కలుపుకొని ఏదైనా మిక్సీలో వేసి ఆడించడం వల్ల కొబ్బరి జ్యూస్ తయారవుతుంది. కొబ్బరి జ్యూస్ లోకి కాస్త ఐస్ క్యూబ్స్ వేసి తిరగ కట్టిన తర్వాత తాగడం వల్ల పలు రకాల లాభాలు పొందవచ్చు. కొబ్బరికాయ నీటి వల్ల కూడా పలు రకాల లాభాలు ఉన్నాయి ముఖ్యంగా వెంటనే శక్తి లభించాలన్న కొబ్బరి నీటిని తాగడం చాలా మంచిది. కొబ్బరి నీటిలో పలు రకాల మినరల్స్ ఉంటాయి కనుక వారంలో ఒకసారి అయినా కొబ్బరి నీటిని తాగడం మంచిదట.

మరింత సమాచారం తెలుసుకోండి: