సాధారణంగా వేసవి మొదలవగానే లభించే సీజనల్ ఫ్రూట్స్ లో మామిడికాయ కూడా ఒకటి. మామిడిపళ్ళను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. మామిడిపళ్ళను మాగిన తర్వాత తినడం కన్నా పచ్చి మామిడి పండ్లను తినడం ద్వారానే ఎక్కువ లాభాలను పొందవచ్చు అని చెబుతున్నారు ఆహార నిపుణులు. మరియు పచ్చి మామిడికాయలను పుల్లగా,తియ్యగా రుచికి చాలా బాగా ఉంటాయని చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు.కానీ వాటి ఆరోగ్య ప్రయోజనాల మీద మాత్రం అంతగా అవగాహన ఉండదు.అస్సలు పచ్చి మామిడికాయలు ముక్కలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో మనము తెలుసుకున్నాం పదండి..

పచ్చి మామిడికాయలు విటమిన్ సి,సోడియం క్లోరైడ్, విటమిన్ ఏ వంటి ఎన్నో పోషకాలను మనము పొందవచ్చు.పచ్చి మామిడి తరుచూ తీసుకోవడంతో జీర్ణాశయ రుగ్మతలను నిరోదిస్తుంది.పచ్చి మామిడి పండ్లను ఎక్కువగా మార్నింగ్ సిక్‌నెస్,మలబద్ధకం, విరేచనాలు,గ్యాస్,క్రానిక్ డిస్‌పెప్సియా మరియు అజీర్ణం వంటి సమస్యలకు ఈజీగా చెక్ పెడుతుంది.


పచ్చి మామిడికాయలను తరచూ తీసుకోవడం వల్ల పిల్లలు అధికంగా వచ్చే స్కర్వి వ్యాధికి ఔషధంగా పనిచేస్తుంది.ఎందుకంటే ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది కనుక.

పచ్చి మామిడికాయ లివర్ వ్యాధి చికిత్సకు ప్రసిద్ధి చెందింది.ఈ కాయ ముక్కను తినడం వల్ల చిన్న ప్రేగులలో పిత్త స్రావం క్రమంగా రిలీజ్ అవ్వడానికి దోహద పడుతుంది.మరియు ఇది కొవ్వుల శోషణను పెంచుతుంది.అంతేకాక ఇది ఆహారంలో కనిపించే హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.దీనితో ఎన్నో రోగాలకు దూరంగా ఉండవచ్చు.

ముడి మామిడి రసం శరీరం నుండి అదనపు సోడియం క్లోరైడ్ మరియు ఐరన్ లోపాన్ని నిరోధించడం ద్వారా నిర్జలీకరణాన్ని వ్యతిరేకస్తుంది.వేసవిలో చెమట ద్వారా ఈ ఖనిజాలు ఎక్కువగా బయటకు వెళ్ళిపోతాయి. అలాంటి సమస్యలకు కూడా పచ్చి మామిడికాయలోని  సుగుణాలు పుష్కలంగా ఉపయోగపడతాయి.

కావున ఇప్పుడు దొరికే పచ్చి మామిడికాయల రుచిని ఆరోగ్యాన్ని సంవత్సరం మొత్తం ఉపయోగించాలంటే, ఆమ్చూర్ పౌడర్ చేసుకుని నిలువ ఉంచుకోవడం చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: