ఇల్లు శుభ్రంగా ఉండడం ఎంత ముఖ్యమో, బాత్రూం కూడా శుభ్రంగా ఉండడం అంతే ముఖ్యం. అయితే చాలా మంది బాత్రూం ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచలేరు. వాళ్ల ఉరుకులు పరుగులు జీవితం కారణంగా కావచ్చు..లేక ఏదైన ప్రాబ్లం కారణంగా కావచ్చు. బాత్రూం ఒకరోజు శుభ్రం చేసిన తర్వాత మళ్లీ మళ్లీ శుభ్రం చేయడం ఎలా సాధ్యం అని బిజీ షెడ్యూల్‌లో వదిలేస్తూ ఉంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు.టాయిలెట్ శుభ్రంగా ఉంచకపోతే, అక్కడ బ్యాక్టీరియా పేరుకుపోయి కొత్త వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా చాలామంది టాయిలెట్ శుభ్రం చేయడానికి రకరకాల ఖరీదైన కెమికల్ క్లీనర్లు వాడుతుంటారు. అయితే ఆ రసాయనాలు పైపైన ఉన్న మరకలు, దుర్వాసన కొంతవరకు తొలగించినా, లోతుగా పేరుకున్న బ్యాక్టీరియాను పూర్తిగా తొలగించలేవు. పైగా, వాటి వాసన ఊపిరితిత్తుల్లోకి వెళ్లి హానికర ప్రభావాలు కలిగించే అవకాశం ఉంది.


ఈ సమస్యకు సులభమైన పరిష్కారం మన ఇంట్లోనే దొరుకుతుందని కొంతమంది డాక్టర్లు సూచిస్తున్నారు. అదీ రాళ్ల ఉప్పు మరియు పసుపు. ఈ రెండు పదార్థాలు సహజసిద్ధమైన శుభ్రపరిచే గుణాలు కలిగి ఉంటాయి. రాళ్ల ఉప్పు గరుకుతనంతో సహజమైన స్క్రబ్బర్‌లా పనిచేస్తూ టాయిలెట్‌లోని కఠినమైన మరకలను తొలగిస్తుంది. పసుపు యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండటం వల్ల క్రిములను నాశనం చేస్తుంది.


విధానం సులభం: రాత్రి పడుకునే ముందు  ఫ్లష్ చేసి, కొంచెం రాళ్ల ఉప్పు మరియు పసుపు వేసి అలాగే రాత్రంతా ఉంచాలి. నీలల్లో కూడా కలిపి వేయచ్చు. తెల్లారిన తర్వాత మరోసారి ఫ్లష్ చేస్తే, పేరుకుపోయిన మరకలు, దుర్వాసన, బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా దీని వాడకానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.సోషల్ మీడియాలో ఈ టిప్‌ను చాలామంది ప్రయత్నించి మంచి ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు.



గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కొంతమంది డాక్టర్లు మరియు సోషల్ మీడియాలో లభ్యమైన సమాచారాన్ని ఆధారంగా చెప్పబడింది. దీన్ని అనుసరించాలా లేదా అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం అని పాఠకులు గుర్తుంచుకోండి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: