తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య తెలుగు అమ్మాయిలకు మంచి ఆదరణ లభిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.  మరోవైపు తమ టాలెంట్ ఏంటో వెండితెరపై చూపిస్తూ మంచి చాన్స్ లు కొట్టేస్తున్నారు.   తాజాగా ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన తెలుగు చిత్రం ‘బాహుబలి’.  ఈ చిత్రంలో దేవకన్యలా కనిపించింది తమన్నా.   అవంతిక పాత్రలో నిజంగా తమన్నా అప్సరసలా మెరిసిపోయింది.  ఈ చిత్రంలో తమన్నా స్నేహితురాలిగా నటించింది వరంగల్  అమ్మాయి భానుశ్రీ .
Image result for aavu puli madhyalo prabhas pelli bhanusri
వరంగల్ లో పుట్టి హైదరాబాద్ లో చదువుకొని సినిమాలపై ఆసక్తితో చిత్ర రంగప్రవేశం చేసిన భామ ఈ భానుశ్రీ . బాహుబలి లో తమన్నా పక్కన కనిపించే ఈ భానుశ్రీ కొన్ని సన్నివేశాల్లో తమన్నా కు డూప్ గా కూడా నటించింది . యాక్షన్ సన్నివేశాల్లో మాత్రమే కాకుండా పాటలో కూడా డూప్ గా నటించిందట.  ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించింది భానుశ్రీ.  

అయితే బాహుబలి సీక్వెల్ బాహబలి 2 లో మాత్రం తన పాత్ర లేదని చెప్పింది.  అయితే కుమారి 21 f, ఆవు పులి మద్యలో ప్రభాస్ పెళ్లి చిత్రాల్లో కూడా ఈ అమ్మడు నటించింది.  ప్రస్తుతం ఇద్దరి మద్య 18 అనే చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.  రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది భానుశ్రీ .


మరింత సమాచారం తెలుసుకోండి: