ఈ మద్య బాలీవుడ్ లో అడల్ట్ కాంటెంట్ ఉన్న సినిమాలు బాగానే వస్తున్నాయి.  అయితే ఇలాంటి సినిమాలో బి గ్రేడ్ హీరోయిన్లు రెచ్చిపోయి మరీ నటిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా లిప్ లాక్, బాత్ రూమ్, బెడ్ రూమ్ సీన్లలో హీరో, హీరోయిన్లు హాట్ హాట్ గా నటిస్తూ..కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఆ మద్య బాలీవుడ్ లో రిలీజ్ అయిన ‘హంటర్’  టాలీవుడ్‌లో ‘బాబు బాగా బిజీ’గా రీమేక్ చేశారు.  ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ మెయిన్ రోల్ లో నటించారు.

టాలీవుడ్‌లో ‘బాబు బాగా బిజీ’ తరువాత ఆ స్థాయి అడల్ట్ కామెడీతో సందడి చేసేందుకు వచ్చేస్తుంది. ‘ఉ. పె. కు. హ’ (ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి) మూవీ.  ఈ సినిమాలో  నట కిరీటి రాజేంద్రప్రసాద్, సాక్షి చౌదరి కీలకపాత్రల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌ను హాట్ మసాలా గా కనిపిస్తుంది. ఆరుగురు హాట్ భామలతో బ్రహ్మానందం, అలీ, ధనరాజ్, కృష్ణ భగవాన్ లాంటి టాప్ కమెడియన్లతో యమ రంజుగా శృంగార భరిత హాస్య చిత్రంగా తీర్చి దిద్దాడు దర్శకుడు నిధి ప్రసాద్‌.

‘ఏంటి మీద మీద పడుతున్నావ్.. నాక్కూడా చూపించూ.. ఏంటి నీకు చూపించేది.. ఆశ పడుతున్నాడు చూపించు అనగానే ఆరుగురు అందమైన భామలు పోటీపడి మరీ అందాలను చూపిస్తున్నారు. జేబీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ మూవీ పెద్దలకు మాత్రమే అని టీజర్‌ని బట్టి ఫిక్స్ అయిపోక తప్పదు. మితిమీరిన ఎక్స్‌పోజింగ్, అంతకు మించిన డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో అసలు సిసలు అడల్ట్ మూవీ ఎలా ఉంటుందో టీజర్‌తోటే రుచిచూపించాడు దర్శకుడు.

అంతే కాదు ఈ సినిమాలో చాలా బోల్డ్ డైలాగ్స్  మీ నాన్న గారు ఏం చేస్తుంటారు అంటే.. అదే చేస్తుంటారు, పాపం వీళ్లంతా పెళ్లి కోసం అలమటిస్తున్నారు, ఆడది కనిపిస్తే చాలు ఆంబోతులా నోరు తెరుచుకోవడమే లాంటి డైలాగ్స్‌తో పాటు అందాల ఆరబోతతో ‘ఉ. పె. కు. హ’ థియేటర్ల‌లో వేడిపుట్టించడం ఖాయంగానే కనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: