చలన చిత్ర సీమలో కొంద మంది జోడి నిజంగా ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నంత గొప్పగా ఉంటుంది.   తెలుగు లో ఎన్టీఆర్, సావిత్రి, నాగేశ్వరరావు-జమున, కృష్ణ - శ్రీదేవి, చిరంజీవి - రాధ, బాలీవుడ్ లో రాజ్ కపూర్ - నర్గీస్, అమితాబచ్చన్-రేఖ,  ధర్మేంద్ర-హేమా మాలిని ఇలా కొన్ని జంటలు తెరపై కనిపిస్తే చాలు అభిమానులు ఎంతోసంతోషించే వారు.  ఇక బాలీవుడ్ లో `దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే`  ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలిసిందే. ముంబైలోని మరాఠా మందిర్ లో ఆ సినిమా ఏకంగా 20 ఏళ్లపాటు ప్రదర్శించారు.
Image result for SHARUKH KHAN KAJOL DILWALE DULHANIYA
ఆ సినిమాలో లీడ్ రోల్స్ పోషించిన షారుక్ ఖాన్ – కాజోల్ ల జోడీ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. బాలీవుడ్ లోని హిట్ లవ్ పెయిర్ లో ఒకరైన షారుక్-కాజల్ లు ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించారు.  ఇక కాజల్ హీరో అజయ్ దేవ్ గాన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో నటించడం మానేసింది.  ఈ మద్య సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.   
Image result for SHAHRUKH KHAN KAJOL DILWALE
తాజాగా ఈ హిట్ పెయిర్ మరోసారి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కబోతున్నట్లు పుకార్లు వస్తున్నాయి.  షారూక్-కాజోల్ ల కాంబోలో మూడేళ్ల క్రితం విడుదలైన `దిల్ వాలే` హిట్ అయింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో మరో చిత్రం రాలేదు. రణ్ జొహర్ ఆ సినిమాను రీమేక్ చేయబోతున్నారట.  గతంలో కాజోల్-కరణ్ ల మధ్య చెలరేగిన వివాదం నేపథ్యంలో ఈ ఇద్దరు కలిసి పనిచేస్తారా…లేదా…అన్నది  తెలియాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: