
బాలీవుడ్ లో బాలనటిగా పరిచయం అయిన హన్సిక తర్వాత పూరి జగన్నాధ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘దేశముదురు’సినిమాతో హీరోయిన్ గా తన అందాలతో కుర్రాళ్ల మనసు దోచింది. అందం, అందుకు తగ్గ అభినయంతో సౌత్ ఇండియాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ హన్సిక. ప్రస్తుతం తమిళంలో స్థిరపడిపోయిన ముంబై ముద్దుగుమ్మ హన్సిక. ఈ 11ఏళ్ల కాలంలో ఆమె ఎన్నో విభిన్న పాత్రలు చేసింది. 'చంద్రకళ' వంటి సినిమాలు ఆమె నటనకు మంచి ప్రశంసలు తెచ్చిపెట్టాయి.

నయనతార .. త్రిష వంటి అగ్ర కథానాయికల పోటీని తట్టుకుంటూ హన్సిక 49 సినిమాలను పూర్తి చేసేసింది. ప్రస్తుతం తన 50వ చిత్రంగా యూఆర్ జమీల్ దర్శకత్వంలో మహా అనే చిత్రం చేస్తుంది. ఆ మద్య హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి మంచి పేరు తెచ్చుకుంది. ‘మహా’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకి జమీల్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ రోజు పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా హన్సిక ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో.. తన పేస్ మాస్క్ లను చేతులో పట్టుకొని హన్సిక డిఫెరెంట్ లుక్‌లో కనిపిస్తోంది.
పోస్టర్ ను బట్టి కాన్సెప్ట్ విభిన్నంగా ఉంటుందనే విషయం అర్థమవుతోంది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ అని ఫిలిమ్ వర్గాలు అనుకుంటున్నారు. ఇప్పటికే హర్రర్ కాన్సెప్ట్ సినిమాల్లో నటించిన అనుభవం ఉన్న హన్సిక ఈసారి ఎలా భయపెట్టబోతుందో అని అనుకుంటున్నారు. చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. గిబ్రాన్‌కి ఇది 25వ సినిమా కావటం విశేషం. తెలుగులోను ఈ సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకువచ్చే ఆలోచనలో వున్నారు.