సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన నటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సైరా తెలుగు, హిందీతోపాటు దక్షిణాది భాషలన్నింటిలో విడుదలైంది. ఈ విజయోత్సాహంలో ఉన్న చిరంజీవి కొరటాల శివతో ఓ సినిమా ప్రారంభించారు. అయితే ఆయన మలయాళ హిట్ చిత్రం లూసీఫిర్ రీమేక్ లో నటిస్తున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. దీనిపై ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

 

 

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, పృథ్వీ రాజ్ మెయిన్ రోల్స్ పోషించిన లూసిఫర్ మలయాళంలో సూపర్ హిట్. ఈ సినిమా రీమేక్ హక్కులను రామ్ చరణ్ తీసుకున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి - రామ్ చరణ్ నటిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ సినిమా హక్కుల కోసం తమిళ్ నుంచి రజినీకాంత్, అజిత్ కూడా ప్రయత్నాలు  చేసినట్టు సమాచారం. అయితే వారెవరికీ ఈ సినిమా హక్కులు ఇవ్వకపోగా తామే మిగిలిన భాషల్లో తెరకెక్కిస్తామని చెప్పారట. కానీ, నిర్మాతలు ఊహించని విధంగా తెలుగు హక్కులను మాత్రం రామ్ చరణ్ కు ఇచ్చేసారు. ఇందుకు కారణం మోహన్ లాల్ చేసిన మాట సాయమేనట. నిర్మాతలను ఒప్పించి మరీ రామ్ చరణ్ కు తెలుగు హక్కులు ఇప్పించాడట. చిరంజీవి - మోహన్ లాల్ మధ్య ఉన్న స్నేహం కారణంగానే ఈ హక్కులు చరణ్ కు వచ్చాయని అంటున్నారు. 

 

 

మోహన్ లాల్ మలయాళంలో సూపర్ స్టార్. సహజమైన నటనకు ఆయన పెట్టింది పేరు. సైరా టీజర్ కు, సినిమాలో ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చి చిరంజీవికి సాయం చేసి వారిద్దరి మధ్య మైత్రిని చాటుకున్నారు. లూసిఫర్ ను తెలుగులో సుకుమార్ దర్శకత్వం వహిస్తారని టాలీవుడ్ లో అనుకుంటున్నారు. తన సినిమాల కథలను తానే రాసుకునే సుకుమార్ మరి రీమేక్ ను తెరకెక్కిస్తాడా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: