కొందరికి అందం అనేది చాలా ప్రత్యేకతను తీసుకు వస్తే, మరి కొందరికి ఎంత అందం ఉన్నా సరైన గుర్తింపు రాదు. ముఖ్యంగా హీరోయిన్స్‌గా నటించే వారి విషయంలో ఈ తేడా సృష్టంగా కనిపిస్తుంది. ఇక కొందరు హీరోయిన్స్ అదృష్టాన్ని అరచేతిలో పట్టుకుని వస్తారేమో, ఒక సినిమా చేయగానే, ఆ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుసపెట్టి అవకాశాలు క్యూ కడతాయి. అయితే ముంబై భామ రిద్ధి కుమార్ విషయంలో మాత్రం అటు స్పీడ్‌గా కాకుండా, స్లోగా కాకుండా అవకాశాలు వచ్చేలా ఉన్నాయి.

 

 

ఎందుకంటే రాజ్ తరుణ్ కి జోడీగా లవర్ సినిమాలో నటించిన ఈ ముంబై భామ రిద్ధి కుమార్. చూడచక్కని అందంతో, కుందనపు బొమ్మలా ఉన్నా తాను నటించిన లవర్ సినిమా హిట్ కాలేక పోయింది. అది కాస్త ఫ్లాప్ కావడంతో అనుకున్న స్థాయిలో ఈ సుందరాంగికి గుర్తింపు రాలేదు. ఇక ఆ సినిమా తర్వాత తెలుగు సినిమాలో ఇప్పటి వరకు ఏ సినిమా అవకాశం దక్కలేదు. పోనీ తాను ప్రయత్నించినా అవకాశాలు వస్తాయని ప్రయత్నం కూడ చేసిందట. కానీ ఎవరు కూడా కనికరించ లేదు. ఇలాంటి సమయంలో రిద్ధి కుమార్ కు ఊహించని విధంగా కలిగిన అదృష్టానికి సంతోషం పట్టలేకపోతుందట..

 

 

అదేమంటే టాలీవుడ్‌లో ఓ బంపర్ ఆఫర్ సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తుంది... అది కూడా బాహుబలి సరసన నటించడానికి ఆ సినిమా దర్శకుడు ఈ ముంబై చిన్నదాన్ని సంప్రదించాడట. ఇకపోతే యూవీ క్రియేషన్స్ లో మరోసారి పాన్ ఇండియా సినిమా రాబోతుంది.. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా పీరియాడికల్ లవ్ స్టొరీగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం దర్శకుడు రిద్ధి కుమార్ ని సంప్రదించినట్లు తెలుస్తుంది.

 

 

ఇకపోతే పాన్ ఇండియా మూవీ అది కూడా ప్రభాస్ తో అంటే కచ్చితంగా తన క్రేజ్ మారిపోవడం గ్యారెంటీ అని భావించిన ఈ భామ ఇంకేమీ ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిలింనగర్ టాక్.. ఇంతకు ఈ చిత్రంలో రిద్ధి కుమార్ పాత్ర ఎంతవరకు పరిమితం చేసారు అనే విషయాన్ని మాత్రం చిత్రబృందం సీక్రేట్ గా దాచారట.. అయితే తెలిసిన సమాచారం ప్రకారం ప్రభాస్‌కు ఫ్లాష్ బ్యాక్‌లో లవర్‌గా నటించవచ్చని అంటున్నారు..  ఏది ఏమైనా ఒక మంచి అవకాశం రిద్ది కుమార్‌లో జోష్‌ను పెంచి అవకాశాలను సృష్టిస్తుంది కావచ్చు అని అనుకుంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: