బాహుబలి సినిమాతో తెలుగు సినిమా చరిత్రనే మార్చివేసిన రాజమౌళి, ప్రభాస్ ని నేషనల్ స్టార్ ని చేసేశాడు. తానేమో నేషనల్ డైరెక్టర్ అయిపోయాడు. డైరెక్టర్ రాజమౌళి అంటే తెలియని వాళ్లు లేరేమో. ఒక్క సినిమా ద్వారా ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాజమౌళి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా ఆర్.ఆర్.ఆర్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

 

అయితే బాహుబలి ఇచ్చిన స్ఫూర్తితో తెలుగులో ప్రతీ హీరో పాన్ ఇండియా రేంజ్ లో తమ అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు. కంటెంట్ బాగుంటే ఏ భాషా సినిమా అయినా ఎగబడి చూస్తున్న జనాలని ఆకట్టుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది.  బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రయత్నం స్టార్ట్ చేశాడు. విజయ్ దేవరకొండ ఫైటర్, మంచు మనోజ్ అహం బ్రహ్మస్మి, మంచు విష్ణు మోసగాళ్లు మొదలగు చిత్రాల ద్వారా పాన్ ఇండియా రేంజ్ సినిమాలు వస్తున్నాయి.

 


అయితే తాజాగా నితిన్ కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమా తీస్తే బాగుంటుందని అంటున్నారు. నితిన్ హీరోగా నటించిన సినిమాల హిందీ వెర్షన్ లకి యూట్యూబ్ లో మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. దక్షిణాది సినిమాల్లో మాస్ సినిమాలని తెగ ఇష్టపడే ఉత్తరాది వారు నితిన్ నటించిన క్లాస్ సినిమాలకి కూడా మిలియన్స్ లో వ్యూస్ ఇవ్వడం అందరికీ షాకిస్తోంది. అ. ఆ, చల్ మోహనరంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలకి కలిపి ౪౦౦ మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

 

క్లాస్ సినిమాలకే వ్యూస్ ఇంతలా ఉంటే, మాస్ సినిమాలకి మరో రేంజ్ లో వ్యూస్ వస్తాయని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రుజువైన సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ యూట్యూబ్ లో విడుదల అయిన ౪౫రోజుల్లోనే వంద మిలియన్లని చేరుకుని రికార్డు సృష్టించింది. మరి వీటిని దృష్టిలో పెట్టుకుని మన హీరోలు పాన్ ఇండియా రేంజ్ సినిమాలకి శ్రీకార్ం చుడతారా అని ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా మన హిందీ వెర్షన్ సినిమాలకి మిలియన్స్ లో వ్యూస్ రావడం మంచి పరిణామమే..

మరింత సమాచారం తెలుసుకోండి: