వరుస పరాజయాల తరువాత గత ఏడాది అర్జున్ సురవరంతో వచ్చి హిట్ కొట్టాడు యంగ్ హీరో నిఖిల్. ఈసినిమా తరువాత నిఖిల్ ,రెండు సినిమాలకు సైన్ చేశాడు. అందులో సూపర్ హిట్ మూవీ కార్తికేయ సీక్వెల్ ఒకటి. కార్తికేయ 2 టైటిల్ తో తెరకెక్కనున్న ఈచిత్రం సమ్మర్ లో ప్రారంభం కావాల్సింది కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఈచిత్రంలో నిఖిల్, డాక్టర్ గా సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడు అందుకు తగ్గట్లు నిఖిల్ ప్రస్తుతం సిక్స్ ప్యాక్ బాడీ తో కొత్త లుక్ లోకి మారాడు.  తాజాగా ట్విట్టర్ లో తన లేటెస్ట్ పిక్ పోస్ట్ చేశాడు నిఖిల్. ఇక ఆ పిక్ లో తన సిక్స్ ప్యాక్ ను చూపించలేదు కానీ లుక్ చూస్తే మాత్రం నిఖిల్ ,సిక్స్ ప్యాక్ తో షూటింగ్ కు రెడీ గా వున్నాడని తెలుస్తుంది.
కరోనా ప్రభావం తగ్గగానే షూటింగ్ స్టార్ట్ కానుంది. కుంభమేళా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈచిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది. చందూ మొండేటి డైరెక్ట్ చేయనుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ ,వివేక్ కూచిబొట్ల ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈసినిమాతోపాటు నిఖిల్ ,18పేజెస్ లో కూడా నటించనున్నాడు. కరెంట్, కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేయనున్న ఈచిత్రాన్ని గీతా ఆర్ట్స్  2  బ్యానర్ పై బన్ని వాసు నిర్మించనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: