రామ్ గోపాల్ వర్మ సినిమా చేస్తే కచ్చితంగా దాని చుట్టూ ఏదోక వివాదమే ఉంటుంది. ఆయన మాట మాట్లాడినా ఆయన ఏది చేసినా సరే దాని చుట్టూ దాదాపుగా వివాదాలు మినహా మరొకటి ఉండదు. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ జీవిత కథను టార్గెట్ చేస్తూ గత ఏడాది ఎన్నికల తర్వాత,  పవన్ కళ్యాణ్ ఏ విధంగా వ్యవహరించారు అనే దానిని ప్రస్తావిస్తూ పవర్ స్టార్ అనే సినిమాను చేస్తున్నారు. 15 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం ఆయన పూర్తి చేసారు. ఒక పాట ను కూడా ఆయన విడుదల చేసారు. 

 

దీనిపై మెగా, పవర్ స్టార్ అభిమానులు చాలా వరకు సీరియస్ గా ఉన్నారు. పవన్ ని అవమానిస్తున్నారు అంటూ పవన్ ఫాన్స్ వర్మను టార్గెట్ గా చేసుకుని కామెంట్స్ చేస్తున్నారు. ఈ తరుణంలో హీరో నిఖిల్ కూడా  పవన్ కి అండగా నిలుస్తూ కామెంట్ చేసాడు. శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా, ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు. మీకు అర్థమయ్యిందిగా’ అంటూ వర్మను పరోక్షంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేసాడు. ఈ మేరకు ఒక ట్వీట్ చేసాడు అతను. దీనికి పవన్ అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంది.

 

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని వర్మ కాసేపటి క్రితం విడుదల చేసారు. ఇది అంతకు ముందే లీక్ అయింది కూడా. ఇందులో పవన్, చంద్రబాబు, త్రివిక్రమ్ సహా కొందరిని వర్మ కాస్త ఇబ్బందిగానే చూపించాడు. దీనిపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వర్మపై అటు జనసేన కార్యకర్తలు కూడా ఇప్పుడు పరువు నష్టం దావా వేయాలని పవన్ ని కోరుతున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ పరిణామం కాస్త హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: