ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిని గుత్తా జ్వాలాతో తమిళనటుడు విష్ణు
విశాల్ ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్టు తెలుస్తోంది. అప్పట్లో వీరిద్దరు ఉంగరాలు పెట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. అంతే కాకుండా
గుత్తా జ్వాల పుట్టిన రోజు వేడుకలకు వచ్చిన విష్ను
విశాల్ గుత్తాజ్వాల కు ఓ సర్పైజ్ ను కూడా ఇచ్చారు. మరో వైపు లాక్ డౌన్ సమయంలో బాయ్ ఫ్రెండ్ ను విడిచి ఉండలేకపోతున్నా అంటూ
గుత్తా జ్వాలా పోస్ట్ పెట్టడం కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ ట్వీట్ కు రిప్లై ఇచ్చిన
విశాల్ లాక్ డౌన్ సమయంలో దూరంగా ఉండటమే మంచిదంటూ తన ప్రేయసిని కూల్ చేశారు. ఇక ఎన్నో రోజుల నుండి ప్రేమలో ఉన్న వీరిజంట ఎప్పుడు
పెళ్లి పీటలు ఎక్కుతారా అని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లిపై విష్ణు
విశాల్ స్పందించారు. ప్రస్తుతం
విశాల్ అరణ్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో
రానా లీడ్ రోల్ పోషించారు. అయితే ప్రస్తుతం ఈ
సినిమా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉంది.
ఈ
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరబాద్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విష్ను
విశాల్ మాట్లాడారు. ఈ సందర్భంగా గుత్తా జ్వాలను త్వరలో
పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించారు. అంతే కాకుండా తెలుగు వారింటికి అల్లుడవ్వబోతున్నా అంటూ కామెంట్స్ చేశారు.
విశాల్ మొదటి సారి స్టేజ్ మీద తమ ప్రేమపై స్పందించారు. ఇక విష్ణు
విశాల్ కు ఇది వరకే వివాహం జరగ్గా నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే తన
భార్య రజినీతో విభేదాల కారణంగా ఆయన తన భార్యకు గతేడాది విడాకులు ఇచ్చారు. మరో వైపు గుత్తా జ్వాలకు కూడా ఇదివరకే బ్యాట్మింటన్ క్రీడాకారుడు చేతన్
ఆనంద్ ను ప్రేమించి
పెళ్లి చేసుకుంది. అయితే వీరి మధ్య కూడా విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. ఇక త్వరలో
పెళ్లి పీటలు ఎక్కబోతున్న విష్ణు
విశాల్ గుత్తా జ్వాలా వైవాహిక జీవితం ఎలా ఉంటుందో చూడాలి.