ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరబాద్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విష్ను విశాల్ మాట్లాడారు. ఈ సందర్భంగా గుత్తా జ్వాలను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించారు. అంతే కాకుండా తెలుగు వారింటికి అల్లుడవ్వబోతున్నా అంటూ కామెంట్స్ చేశారు. విశాల్ మొదటి సారి స్టేజ్ మీద తమ ప్రేమపై స్పందించారు. ఇక విష్ణు విశాల్ కు ఇది వరకే వివాహం జరగ్గా నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే తన భార్య రజినీతో విభేదాల కారణంగా ఆయన తన భార్యకు గతేడాది విడాకులు ఇచ్చారు. మరో వైపు గుత్తా జ్వాలకు కూడా ఇదివరకే బ్యాట్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరి మధ్య కూడా విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. ఇక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విష్ణు విశాల్ గుత్తా జ్వాలా వైవాహిక జీవితం ఎలా ఉంటుందో చూడాలి.