జెంటిల్మెన్ సినిమాతో కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు దర్శకుడి గా ఎంట్రీ ఇచ్చిన ప్రఖ్యాత దర్శకుడు శంకర్ ఆ మూవీతో భారీ సక్సెస్ అందుకున్నారు. అర్జున్, మధుబాల కలయికలో తెరకెక్కిన ఆ భారీ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనంతరం జీన్స్, భారతీయుడు వంటి సక్సెస్ఫుల్ సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్న శంకర్ ఆపై మరింత వేగంగా సినిమాలు చేస్తూ కొనసాగారు. ఇక శంకర్ తో ఎవరైనా హీరో సినిమా చేస్తున్నారు అంటే ఆడియన్స్ లో ఆ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి. ఆ విధంగా తన ఆకట్టుకునే డైరెక్షన్ టాలెంట్ తో ఆడియన్స్ నుంచి మంచి పేరు దక్కించుకున్న శంకర్ తొలిసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక భారీ పాన్ ఇండియా సినిమాని అతి త్వరలో చేయనున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ జానర్లో ఒక వినూత్నమైన స్టోరీతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రూపొందనుందని ఇందులో ఒక యువ సైంటిస్ట్ పాత్రను చరణ్ పోషించనున్నారు అనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆ విషయం అటుంచితే ఈ మూవీకి సంగీత దర్శకుడు ఎవరు వ్యవహరిస్తారు అనే దానిపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రానట్లు తెలుస్తోంది.

మరోవైపు ఏ.ఆర్.రెహమాన్, అనిరుద్ రవిచందర్, యువన్ శంకర్ రాజా, హరీష్ జయరాజ్ వంటి వారి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ సరికొత్తగా యువ సంగీత దర్శకుడు తమన్ పేరు కూడా తెరపైకి రావడంతో పక్కాగా ఈ ప్రతిష్టాత్మక మూవీ కి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరు వ్యవహరిస్తారు అనేది మాత్రం అందరిలోనూ సందిగ్ధంగా మారింది. మరోవైపు శంకర్ కూడా ఆ విషయమై ఎంతో ఆలోచనలో పడ్డారని, ముఖ్యంగా అనిరుద్, తమన్ లలో ఎవరో ఒకరిని తీసుకునేలా ఆయన యోచిస్తున్నారని అంటున్నారు. మరి ఈ విషయమై పక్కాగా క్లారిటీ రావాలి అంటే యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: