సాధారణంగా సినిమాల్లోకి రావాలనుకునే యువకులు... ఎక్కువగా గ్లామర్ పాత్రలో కనిపించాలని కోరుకుంటుంటారు. అలా స్టార్ హీరోలు అయిపోయి మంచి పాపులారిటీ తెచ్చుకోవాలి అన్నది వారి ఉద్దేశ్యం. అయితే అందుకు భిన్నంగా నటులు కొందరుంటారు. వాళ్లకి సినిమా అంటే పాషన్. దాని కోసం తమ ప్రాణాలు సైతం పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. వీరి ఆకాంక్షలు ఎలా ఉంటాయంటే ఒక మంచి సినిమా తెరకెక్కడంలో తను కీలక భాగస్వామిగా మారాలి అనుకుంటారు. అందుకోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉంటారు. అలాంటి అరుదైన వారిలో ఒకరు యంగ్ హీరో అడవి శేష్. తన సృజనాత్మకతతో అంకితభావంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు ఈ హీరో.

మామూలు తరహా సినిమా కథలను పక్కన పెట్టి.... విభిన్న స్టోరీలను ఎంచుకుంటూ విజయాలు సాధించడం శేష్ కు వెన్నతో పెట్టిన విద్య. క్షణం, గూడచారి వంటి వైవిధ్యభరిత కథలను రాసి తెరకెక్కించి రైటర్ గా మరియు హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో మహేష్ బాబు నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ `మేజర్`లో ప్రధాన పాత్రలో చేస్తున్న విషయం తెలిసిందే. 26/11 ఎటాక్స్ అమరవీరుడు సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది.  సినిమాలో కథానాయకుడిగా  చేయడంతోపాటు  ఈ చిత్రానికి స్క్రిప్టును కూడా శేష్ అందించారు. రచయితగా ఉండటం నటుడిగా అతని ఎంపికలను ప్రభావితం చేస్తుందా ? అంటే..... రచన నా మొదటి ఆయుధం అని పేర్కొన్నారు అడివి శేష్. కలంతో నేను యుద్ధానికి వెళ్ళగలను.

కానీ చివరికి అది నా నటనా వృత్తికి ఉపయోగపడింది అని శేష్ తెలిపారు. కానీ ఒక రచయితగా గొప్ప పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్న నేను..నాలోని నటుడిని పరిమితం చేయనివ్వకుండా ప్రయత్నిస్తాను. సినిమా అంటే కళారంగం. నాకున్న కలను ఇక్కడ ప్రతిబింబించి ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇవ్వాలన్నదే నా ఆకాంక్ష అంటూ పేర్కొన్నారు. ఇప్పటికే మేజర్ షూటింగులో ఉంది. దీని తరువాత హిట్ సీక్వెల్ లో కూడా నటించనున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: