ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో.. శృతి హాసన్ తనకు తెలియకుండా ఓ కేసులో ఇరుక్కోబోతుంది.. వివరాల్లోకి వెళితే తమిళనాడు లో రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్ గా ఉన్నాయి. నిన్న ఎలక్షన్ డే కావడంతో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్నారు.దేశవ్యాప్తంగా తమిళనాడు, కేరళల్తో పాటు పుదుచ్చేరి లో కూడా ఎలక్షన్స్ జరిగాయి.. సెలెబ్రిటీలు సైతం క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

దళపతి విజయ్ సైకిల్ మీద వచ్చి మరీ తన ఓటుహక్కు ని నిర్వర్తించగా రజినీకాంత్, కమల్ హాసన్, విక్రమ్,సూర్య, అజిత్ వంటి హీరోలు కూడా ఓటు వేసి తమ బాధ్యతను నిర్వర్తించారు . ఇక శృతి హాసన్ కూడా తన తండ్రి కమల్ హాసన్ తో , చెల్లెలు అక్షర హాసన్ తో కలిసి ఓటు హక్కు ను వినియోగించున్నారు.. శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్  తమిళ రాజకీయాల్లో ఉన్న సంగతి తెలిసిందే.. అలాంటిది శృతి కమల్ పోటీ చేస్తున్న కోయంబత్తూర్ దక్షిణం నియోజకవర్గంలో ని ఓ పోలింగ్ బూతులోకి వెళ్లడం వివాదాస్పదమైంది.

కమల్ కి ఎలాంటి పదవి లేదు. పైగా ఆమె పోలింగ్ బూత్ ఏజెంట్ కూడా కాదు.. మీడియా పర్సన్ అంతకన్నా కాదు. దేంతో జరుగుతున్న ఎలక్షన్స్ బూత్ లోకి  ఆమెను ఎలా అనుమతి ఇచ్చారు అని బీజేపీ శృతి హాసన్ పై కేసు నమోదు చేస్తుంది. ఆమె పోలింగ్ బూతు కి వెళ్లడమే తప్పు అంటే ఎలక్షన్ రోజు తన తండ్రి కి ఓటు వేయమని చెప్పడం కూడా నేరమని వారు ఆరోపిస్తున్నారు. ఆమెకు ఎన్నికల నియమావళి తప్పనందుకు ఏ శిక్షలు అయితే వేస్తారో ఆ శిక్షలు వేయాలని విన్నవిస్తున్నారు.. మరి అనుకోని ఈ కేసు పై శృతి హాసన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: