టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోల సినిమాలలో గెస్ట్ రోల్ చేస్తూ ఇద్దరు హీరోల అభిమానులు ఖుషీ చేస్తూ ఉంటారు స్టార్ హీరోలు. వారు స్టార్ గా ఎదగక ముందు హీరోగా రాకముందు కొన్ని చిన్న పాత్రల్లో మెరిసి ఆ తర్వాత స్టార్ గా ఎదిగాక తాము ఆ సినిమాల్లో చేశామని చెప్పుకుంటూ ఉంటారు. ఆ విధంగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాను సినిమాల్లోకి రాకముందు మెగాస్టార్ చిరంజీవి సినిమా డాడీ సినిమా లో నటించారు. 2001 లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా లో డాన్సర్ గా కనిపించారు.

తండ్రి బ్యానర్లో వస్తున్న సినిమా కావడం, మామయ్య చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా కావడం తో ఈ సినిమాలో కీలకమైన డ్యాన్సర్ పాత్రను పోషించడానికి అల్లుఅర్జున్ ఒప్పుకున్నారు. ఈ సినిమా కథను మలుపు తిప్పే ఈ పాత్రలో వేరొకరిని ఊహించలేని విధంగా అల్లు అర్జున్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. సినిమాల్లోకి రాకముందే తనకు డ్యాన్స్ ఏ రేంజ్ లో వచ్చో ఈ సినిమాతోనే నిరూపించుకున్నాడు తనని తాను అల్లు అర్జున్. చురుకుగా కదిలే ఈ కుర్రాడిని ప్రేక్షకులు గమనించిన కూడా అతను ఇప్పుడు ఇంత స్టార్ గా ఎదుగుతాడు అని అనుకోలేదు కాబోలు.

ఈ చిత్రంతో సురేష్ కృష్ణ దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమవగా సిమ్రాన్ హీరోయిన్ గా రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్ర పోషించాడు. ఇక ఈ సినిమా ద్వారా మంచి పేరు అందుకుంది బాలనటి అనుష్క మల్హోత్రా. మెగాస్టార్ కెరీర్ లోనే ఎంతో డిఫరెంట్ చిత్రంగా ఉన్న ఈ సినిమా హిందీలో కూడా రీమేక్ అయి సూపర్ హిట్ సాధించింది. 97 సెంటర్లలో 50 రోజులు, 15 సెంటర్లలో 100 రోజులు ఆడి అప్పట్లో మంచి రికార్డును సెట్ చేసింది. ఎస్ ఎ రాజ్ కుమార్ సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవగా తమిళ్ లో కూడా ఈ సినిమా రీమేక్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: