ఈ మధ్యకాలంలో సినిమాలలో తమకు నచ్చని ఏదైనా పదం పెట్టినప్పుడు లేక ఏదైనా మతాన్ని కించపరిచేలా చూపించినప్పుడు కచ్చితంగా ఆ సినిమాని బాయి కట్ చేసే ట్రెండ్ ఎక్కువైపోయింది. అయితే తాజాగా కాంతార:చాప్టర్ 1 మూవీని బాయ్ కట్ చేయాలి అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.మరి కాంతార: చాప్టర్ 1 మూవీని టార్గెట్ చేస్తున్నది ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. కన్నడ నటుడు దర్శకుడు అయినటువంటి రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయనే హీరోగా నటించిన తాజా మూవీ కాంతార: చాప్టర్ 1.. 2022లో విడుదలైన కాంతార మూవీకి ప్రీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

ఇప్పటికే కాంతార సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో కాంతార: చాప్టర్ 1 పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.ఈ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా టీజర్, ట్రైలర్,పాటలు ఇలా ప్రతి ఒక్కటి ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి పెద్ద చిక్కచ్చి పడింది.కన్నడ లోని కాంతార' చాప్టర్ 1 సినిమాని తెలుగులో బహిష్కరించాలి అంటూ బాయ్ కట్ కాంతార: చాప్టర్ 1 అనే పోస్టులను పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా కన్నడ వాళ్ళు మన సినిమాల్ని ఆదరించనప్పుడు వాళ్ల సినిమాల్ని మాత్రం మనమెందుకు ఆదరించాలి. దానిని బాయ్ కట్ చేయండి అన్నట్లుగా వార్తలు క్రియేట్ చేస్తున్నారు.

 నిజానికి చెప్పుకోవాలంటే కన్నడలో వచ్చే కాన్సెప్ట్ లు చాలా అద్భుతంగా ఉండడం వల్లే మనం కన్నడ సినిమాలకు అట్రాక్ట్ అవుతున్నాం. అలాగే మన సినిమాలు కూడా కన్నడలో విడుదలై హిట్ అవుతున్నాయి. కానీ తాజాగా వైరల్ అయ్యే కాంతార: చాప్టర్ 1 బాయ్ కట్ అనే పోస్టులు మాత్రం కొంతమంది పనిగట్టుకొని చేస్తున్నారు అనే రూమర్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దసరా బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్ ఓజి మూవీ హిట్టా ఫట్టా చెప్పలేకపోతున్నారు. బయ్యర్లకు లాభాలు రావాలంటే ఖచ్చితంగా దసరా సీజన్ మొత్తం ఆడాల్సిందే.ఇలాంటి సమయంలో కాంతార: చాప్టర్1 సినిమాకి కలెక్షన్లు తగ్గిపోతాయి. ఈ కారణంతోనే అలా చేస్తున్నారా..

లేక ఎన్టీఆర్ స్నేహితుడు రిషబ్ శెట్టి అనే ఉద్దేశంతో ఆయన సినిమాని బాయ్ కట్ చేస్తున్నారా అనేది తెలియట్లేదు. ఇక మరో విషయం ఏమిటంటే..డబ్బింగ్ సినిమాలకు అంత రేట్లు పెంచడం ఎందుకు అనే విషయాన్ని కూడా లేవనెత్తుతున్నారు. ఓవర్సీస్ లో తెలుగు, హిందీ డబ్బింగ్ లకి అంత రేట్లు పెట్టడం అవసరమా అనే విషయాన్ని బయటకు తీస్తూ బాయ్ కట్ కాంతార: చాప్టర్ 1 అంటూ ట్రెండింగ్ లోకి తెస్తున్నారు.అయితే దీని వెనక పెద్ద కుట్ర జరుగుతోందని,కొంతమంది కావాలనే ఈ సినిమాను టార్గెట్ చేస్తున్నారని పలువురు  మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ విషయం వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు అని కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: