
దంగల్ చిత్రంలో ఆమీర్ ఖాన్‌కి కూతురుగా నటించిన నటి ఫాతిమా సన షేక్, ఆ తర్వాత అదే ఆమీర్‌తో ది థగ్స్ అఫ్ హిందూస్తాన్ సినిమాలో కూడా నటించింది. ఆమీర్ పట్టుబట్టి మరీ ఆమెనే రికమెండ్ చేశాడన్న గుసగుసలు కూడా ఉన్నాయి. ఇక ఫాతిమా గత మూడేళ్లుగా ముంబై వచ్చిన ప్రతి సారి ఆమీర్‌ను సీక్రెట్‌గా కలుస్తూనే ఉందట. వీరిద్దరు చాలా పార్టీలకు కూడా కలిసే హాజరవ్వడం కూడా అనేక సందేహాలకు కారణమైంది. చివరకు ఇది కిరణ్ రావు వరకు వెళ్లింది. 1992లో ఫాతిమా హైదరాబాద్‌లోనే జన్మించారు.
ప్రస్తుతం 29 ఏళ్లు ఉన్న ఈ భామ 2016లో చాచి 420, వన్ 2 కా 4 వంటి సినిమాల్లో కూడా నటించింది. ఆకట్టుకునే అందం ఆమె సొంతం. చక్కటి అభినయం కూడా ఉంది. విచిత్రం ఏంటంటే 1986లో రీనా దత్తాను పెళ్లాడి 15 ఏళ్లకే విడాకులు ఇచ్చిన ఆమీర్ ఆ తర్వాత 2005లో లగాన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట ర్ గా పని చేసిన కిరణ్ రావును పెళ్లాడారు. మళ్లీ కరెక్టుగా 15 ఏళ్లకు ఆమెతో కూడా విడిపోయారు. 56 ఏళ్ల వయసు ఉన్న అమీర్ ఖాన్ ఈ 29 ఏళ్ల భామను పెళ్లి చేసుకోబోతున్నారనే ఇప్పుడు అందరూ అంటున్నారు. మరి ఆమీర్ ఏం చేస్తాడో ? చూడాలి.