
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ ముంబైలోని ముంబైలోని ఒబెరాయ్ 360 పడమరలో తనకున్న విలువైన అపార్ట్‌మెంట్‌ను అమ్ముకున్నాడు. దీని అమ్మకం ద్వారా ఐశ్వర్యారాయ్ భర్త అభిషేక్‌కు రూ.45.75 కోట్లు వచ్చాయట. అయితే, ఈ డబ్బు ద్వారా అభిషేక్ న్యూ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నట్లు బీ టౌన్‌లో టాక్ వినిపిస్తుండగా, అఫీషియల్‌గా కన్ఫర్మేషన్ అయితే కాలేదు. అభిషేక్ ఈ హౌజ్‌ను 2014లో రూ. 41 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుండగా, అదే బిల్డింగ్‌లో హీరో షాహిద్ తన అపార్ట్‌మెంట్ కోసం రూ. 56 కోట్లు చెల్లించగా, కిలాడీ అక్షయ్ రూ.52.5 కోట్లు పెట్టి తన కోసం ఒక హౌజ్ కొనుగోలు చేశారు.
ఈ అపార్ట్‌మెంట్స్‌లోనే బాలీవుడ్ బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ దిశా పటానీ, రాణి ముఖర్జీ హౌజెస్ కొనుగోలు చేశారు. అభిషేక్ ప్రేక్షకులకు చివరగా ‘ది బిగ్ బుల్’లో కనిపించాడు. వివాదాస్పద స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ ఫిల్మ్ డిస్నీ హాట్‌స్టార్ వేదికగా విడుదలైంది. ఇక ఆయన నటించిన ‘దస్వి, బాబ్ బిశ్వస్’ మూవీస్ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అభిషేక్ వైఫ్ బ్యూటిఫుల్ ఐశ్వర్యారాయ్ ప్రేక్షకులకు అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావుతో కలిసి నటించిన ‘ఫన్నీ ఖాన్’ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఈ అందాల భామ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్‌లో వస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ ఫిల్మ్‌లో కనిపించనుంది
ఈ సినిమా కల్కి కృష్ణమూర్తి తమిళ నవల ఆధారంగా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా రెండు లేదా మూడు పార్ట్స్‌గా రాబోతున్నదని తెలుస్తోంది. ‘పొన్నియిన్ సెల్వన్’లో ఐశ్వర్యారాయ్ ‘నందినీ దేవి’గా కనిపించబోతున్నది. ఈ సినిమా కోసం పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకులు వెయిట్ చేస్తుండగా, ఇందులో భారీ తారాగణమే నటిస్తోంది. విక్రమ్, త్రిష, కార్తీ, జయం రవి, విక్రం ప్రభు, జయరాం, ఐశ్వర్య లక్ష్మి, శోభితా దూళిపాళ, పార్థిబన్, శరత్ కుమార్, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి వర్మన్ సినిమాటోగ్రఫర్ కాగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.