టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఐటమ్ గర్ల్ గా ఎన్నో పాటలలో ప్రేక్షకులను అలరించి నటిగా ఎన్నో సినిమాలలో నటించి అందరిని ఎంతగానో ఖుషీ చేసింది హీరోయిన్ సిల్క్ స్మిత. ఆమె జీవితాన్ని కథగా మలచి ఓ సినిమాను కూడా చేశారు. ఆ చిత్రంలో ఆమెకు సంబంధించిన జీవిత విశేషాలు వెల్లడించారు. సినిమాల్లో ఎలా ఎదిగింది.. ఎలా నష్టపోయింది ఎలా మోసపోయింది అనే విషయాన్ని కూడా వెల్లడించారు. తొలుత ఎక్కువగా ఐటమ్ పాటలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరించిన ఈమె ఆ తర్వాత హీరోయిన్ పాత్రలు ఇతర ముఖ్య పాత్రలు కూడా చేసుకుంటూ పాపులారిటీ దక్కించుకుంది.

ఆమె తన జీవితంలో ఒక హీరోను నమ్మి దారుణంగా మోసపోయినట్లుగా చాలాసార్లు చెప్పింది. ఆమె బయోపిక్ లో కూడా ఇదే చూపించారు. ఆమెను భార్యగా కాకుండా కేవలం ఒక వేశ్య లా చూసి ఆమెను వాడుకుని వదిలేశారని ఆమె ఎన్నోసార్లు ఆరోపించింది. అదే ఆమెను చనిపోయేలా చేసింది. అంతే కాదు ఆమె సంపాదించిన డబ్బు మొత్తం సినిమాలలో పెట్టి ఆ సినిమాల ద్వారా భారీ నష్టాన్ని చూసి ఆమె కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు పడింది. ఆ మధ్య ఆమె చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.

సినిమా పరిశ్రమలో ఇలా ఒత్తిడి తట్టుకోలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తున్నాం. అలా ఆమె చనిపోవడం అప్పట్లో పెద్ద సంచలనం కాగా ఆమె అభిమానులకు ఆమె తీరని లోటు మిగిల్చింది. ఇప్పటికీ ఆమె పాట కానీ సినిమా కానీ సీను కానీ టీవి లో వస్తే ఆమె అభిమానులు కన్నార్పకుండా చూస్తూ ఉంటారు. అలా సిల్క్ స్మిత మరణించగా ఆ తర్వాత ఆమెను ఎంతోమంది అభిమానులు మర్చిపోలేక ఆమెనే ఆరాధిస్తూ ఇప్పటికీ ఉన్నారు. భారీ స్థాయిలో మార్కెట్ క్రేజ్ పాపులారిటీ ఉన్న హీరోయిన్ ఈమె అని చెప్పవచ్చు ఏదేమైనా సిల్క్ స్మిత లాంటి హీరోయిన్ మళ్ళీ ఇంతవరకు పుట్టలేదు అనే చెప్పాలి. ఏ పాత్రకైనా సై అంటూ ప్రేక్షకులను అలరించడమే ధ్యేయంగా ముందుకు సాగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: