దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా గౌరీ రోణంకి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పెళ్లిసందD, ఈ సినిమాలో ముద్దుగుమ్మ శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా థియేటర్ ల దగ్గర పర్వాలేదు అని అనిపించుకుంది. అయితే ఈ సినిమా ద్వారా హీరోయిన్ శ్రీ లీల కు మాత్రం మంచి గుర్తింపు లభించింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో శ్రీ లీల  తన అంద చందాలతో, నటనతో ఎంతో మంది తెలుగు యువత మనసు కొల్లగొట్టింది. అయితే మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్న ఈ హీరోయిన్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా నే ఆఫర్లు కూడా వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీనాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధమాకా సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది అంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే ఒక  మెగా హీరోతో కూడా శ్రీ లీల ఛాన్స్ కొట్టేసింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలతో పాటు మరో రెండు, మూడు సినిమాల ఆఫర్స్ ను కూడా  శ్రీ లీల లైన్ లో పెట్టింది అంటూ అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం శ్రీ లీల కు మరో అదిరిపోయే అవకాశం వచ్చింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబం నుండి ఆశిష్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇంకా మొదటి సినిమా విడుదల కాకముందే రెండ వ సినిమా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆశిష్ రెండవ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల ను దిల్ రాజు కన్ఫామ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్త పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: