ఏదైనా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు అంటే ముందుగా కథ రాసుకోవడం పద్ధతి.. ఆ కథను రాసుకునేటప్పుడు కూడా కొంతమంది నటీనటులను ఊహించుకుంటూ.. కథకు తగ్గ నటీనటులకు సెట్ అయ్యే పాత్రలను ఎన్నుకొని, ఆ పాత్రలకు తగ్గ డైలాగులను రాస్తూ ఉంటారు. వారిని ఆ పాత్రల కోసం తీసుకొచ్చి నటింపజేయడం లాంటివి జరుగుతుంటాయి.. ఇకపోతే ఎప్పుడైనా ఆ నటీనటులకు సమయం లేక రాలేము అని చెబితే కొన్ని సినిమాలైతే వేరేవాళ్లను పెట్టి నటింప చేస్తారు కానీ మరికొన్ని సినిమాలలో వాళ్ళు తప్ప మరెవరూ చేయలేరు అని అనుకున్నప్పుడు వారికోసం ఎదురు చూడడానికి దర్శక రచయితలు వెనుకాడరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


ఒక సినిమా కోసం, ఒక పాత్ర కోసం ఏకంగా మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కోసం దర్శకుడు ఆరు నెలలపాటు ఎదురు చూశారట.. ఆ సినిమానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమాలో మమ్ముట్టి కోసం .. పాత్ర కోసం ఏకంగా ఆరు నెలలు ఎదురు చూసి ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి  పాదయాత్ర సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. ఇక ఈ సినిమాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కి తండ్రి అయిన రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు నటించి మెప్పించారు. వైయస్ రాజశేఖర రెడ్డి తన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చారు.. ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా ఆయన ఎలా సహాయం చేశారు అనే ప్రతి చిన్న అంశాన్ని కూడా ఈ సినిమాలో చిత్రీకరించడం జరిగింది.


రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి లీనమై నటించడం అందరికీ ఆనందాన్ని పంచింది. ఇక ఈ చిత్రం ఎప్పటికీ ఎవర్గ్రీన్ గా ఉండి పోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రముఖ దర్శకుడు మహీ.వి. రాఘవ్  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఒక అద్భుతం అని చెప్పవచ్చు. సబితా ఇంద్రారెడ్డి పాత్రలు సుహాసిని నటించగా గౌరు సుచరితారెడ్డి పాత్రలు అనసూయ నటించి మెప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: