ఇటీవల కొన్నాళ్లుగా సినిమా నటులు తమ మనసుకు నచ్చిన వారిని ప్రేమించి వివాహం చేసుకోవడం పరిపాటి అయిపోయింది. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ని ప్రేమించి వివాహమాడిన విషయం తెలిసిందే. ఇక నేడు బాలీవుడ్ సినీ, బుల్లితెర నటి మౌని రాయ్ తన బాయ్ ఫ్రెండ్ ని ప్రేమించి వివాహమాడిన విషయం ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.

కొన్నాళ్లుగా తన బాయ్ ఫ్రెండ్ సూరజ్ నంబియార్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన మౌని పలు సందర్భాల్లో అతడితో కలిసి దర్శనం ఇచ్చింది. అసలు వీరిద్దరిది ప్రేమేనా లేక కేవలం రిలేషనా అనే అనుమానాలు కూడా ఆమధ్య కొందరు ప్రేక్షకులు వ్యక్తం చేసారు. అయితే తామిద్దరికీ ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమ అని, ఒకరి మనసులు మరొకరు ఇచ్చి పుచ్చుకోవడంతో పాటు ఇద్దరి అభిప్రాయాలు, ఇష్టాలు కూడా కలవడంతో నేడు వివాహము చేసుకున్నాం అని ఈ జంట చెపుతోంది.

గతంలో నాగిని సీరియల్ తో పాటు అక్కడక్కడా పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా సందడి చేసిన మౌని రాయ్, నాగిని సీరియల్ ద్వారానే తెలుగు ఆడియన్స్ కి కూడా ఎంతో దగ్గరైంది. బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ కెజిఎఫ్ మూవీ హిందీ వర్షన్లో ఒక సాంగ్ కూడా చేసి అందరినీ ఎంతో ఆకట్టుకుంది మౌని రాయ్. అలానే అభిషేక్ బచ్చన్ నటించిన రన్ లో కూడా మౌని చేసిన స్పెషల్ సాంగ్ కి ఎంతో మంచి పేరు లభించింది. మౌని కుటుంబంతో పాటు దుబాయ్ లో వ్యాపారవేత్తగా సెటిల్ అయిన సూరజ్ కుటుంబసభ్యులు కూడా వీరిద్దరి వివాహానికి ఒప్పుకుని గోవాలో మలయాళీ సంప్రదాయబద్ధంగా ఎందరో అతిథుల సమక్షంలో ఎంతో అంగరంగవైభవంగా నిర్వహించారు. ఇక తమ అభిమాన నటి వివాహం జరుగడంతో పలువురు మౌని రాయ్ అభిమానులు, సినిమా ప్రముఖులతో పాటు పలువురు ప్రేక్షకులు ఆమెకు ప్రత్యేకంగా వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: