తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు వచ్చిన అనేక మంది కమెడియన్స్ లో కొందరు ప్రేక్షకాభిమానులని అలరించి మంచి పేరు సంపాదించగా మరికొంతమంది మరింతగా ఆకట్టుకుని ప్రేక్షకాభిమానుల్లో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని పొందారు. అటువంటి వారిలో ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం ఒకరు. తొలిసారిగా జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన అహనా పెళ్ళంట సినిమా ద్వారా కమెడియన్ గా అరగొండు బ్రహ్మానందం అనే పాత్రలో నటించి ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించారు బ్రహ్మానందం.
సినిమా అప్పట్లో పెద్ద విజయాన్ని అందుకోవడంతో పాటు ఆయన పాత్రకి కూడా ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టడంతో ఆ విధంగా తొలి చిత్రంతోనే సక్సెస్ అయ్యరు బ్రహ్మానందం. ఇక అక్కడి నుండి మెల్లగా ఆయనకు అవకాశాలు రావడం, అనంతరం జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఇవివి సత్యనారాయణ వంటి కామెడీ చిత్రాల దర్శకుల సినిమాలతో పాటు దాదాపుగా ఎందరో టాప్ దర్శకులు హీరోల సినిమాల్లో అనేక వందల పాత్రలు పోషించిన బ్రహ్మానందం వాటి ద్వారా ఆడియన్స్ మనసులో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక తన కెరీర్ లో వేయికి పైగా సినిమాలు చేసి పలు అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు కూడా దక్కించుకున్న బ్రహ్మానందం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జన్మించారు. చదువుల అనంతరం తెలుగు లెక్చరర్ గా పని చేసిన బ్రహ్మానందాన్ని తొలిసారిగా చూసిన జంధ్యాల ఆయనని అహనా పెళ్ళంట సినిమాలో తీసుకున్నారు. ఇక స్క్రీన్ పై బ్రహ్మి అలా కొంత సేపు కనిపిస్తే చాలు తొమ్మిదేళ్ల బాలుడి దగ్గరి నుండి తంబై ఏళ్ళ వృద్ధుడి వరకు కడుపుబ్బా నవ్వి తీరాల్సిందే. ఆ విధంగా కెరీర్ లో బ్రహ్మ్మనందం చేసిన అనేక పాత్రలు ప్రేక్షకులకి గిలిగింతలు పెట్టాయి.
బ్రహ్మానందం సతీమణి లక్ష్మి గృహిణి. వారి దంపతులకు గౌతమ్, సిద్దార్థ ఇద్దరు సంతానం. మొదటి నుండి కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మంచి మనస్తత్వం కలిగిన బ్రహ్మానందం, తనకు వీలైనంతలో పలువురికి ఆర్ధిక సహాయాలు కూడా చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు. అయితే విషయం ఏమిటంటే, నేడు బ్రహ్మానందం 65వ జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా పలువురు సినిమా ప్రముఖులు, ప్రేక్షకులు ఆయనకి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేస్తూ ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుతున్నారు. 2009లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న బ్రహ్మానందంకి ఇటీవల గుండె శాస్త్ర చికిత్స జరిగిన అనంతరం ఎక్కువగా ఇంటి వద్దనే ఉండి రెస్ట్ తీసుకున్నారు. రెండేళ్ల రెస్ట్ అనంతరం అక్కడక్కడా పలు సినిమాల్లో గెస్ట్ అఫియరెన్స్ పాత్రలు చేసిన బ్రహ్మానందం ప్రస్తుతం కృష్ణవంశీ తీస్తున్న రంగమార్తాండ సినిమాలో ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ద్వారా కెరీర్ పరంగా ఆయన ఎంతవరకు మంచి బ్రేక్ అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: