మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ఆయన తనయుడు రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో కలిసి నటించిన సినిమా ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై ఎంతో భారీ వ్యయంతో నిర్మితం అయిన ఆచార్య ని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించగా తిరు ఫోటోగ్రఫిని అలానే మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో ఆచార్య అనే పాత్రలో మెగాస్టార్ కనిపించగా, సిద్ద పాత్రని రామ్ చరణ్ పోషించారు.

యువ భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అజయ్ , నాజర్, సోనూ సూద్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలు చేసారు. అయితే మొదటి నుండి అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిన ఆచార్య మూవీ రిలీజ్ తరువాత మాత్రం భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. వాస్తవానికి తొలి రోజు తొలి ఆట నుండే ఆచార్యకు చాలా ప్రాంతాల నుండి నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే తొలి రోజు చాలా వరకు నెగటివ్ టాక్ రావడంతో రాను రాను సినిమాకు కలెక్షన్స్ మరింత భారీగా పడిపోయాయి. సినిమాని దర్శకుడు కొరటాల తెరకెక్కించిన తీరు అసలు బాగోలేదని, చిరు తో పాటు చరణ్ కూడా తమ పాత్రల్లో ఎంతో బాగా యాక్ట్ చేసినప్పటికీ కథ, కథనాల్లో భారీగా లోపాలు ఉండడం వల్లనే ఆచార్య పెద్ద డిజాస్టర్ గా మారిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా రూ. 140 కోట్లవరకు జరుగగా, ఇప్పటివరకు మూవీ కేవలం రూ.40 కోట్ల లోపే రాబట్టిందని సమాచారం. మరోవైపు సినిమా ఇటీవల అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో మరింత దారుణంగా నడుస్తోందని, మొత్తంగా క్లోసింగ్ సమయానికి ఆచార్య రూ.90 నుండి రూ. 100 కోట్ల మేర నష్టాలూ మిగిల్చ అవకాశం గట్టిగా ఉందని వారు అంటున్నారు. ఒకరకంగా ఇటీవల వచ్చిన సినిమాల్లో రాధేశ్యామ్ ఫ్లాప్ కాగా, దానిని మించేలా మరింత దారుణంగా ఆచార్య నష్టాలు మిగిల్చే అవకాశం లేకపోలేదని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: