నేటి రోజుల్లో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలంటే సోషల్ మీడియా అనేది మంచి ప్లాట్ ఫామ్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో తమ టాలెంట్ నిరూపించుకుని ఇక సినిమాలో హీరోగా నటిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్నార్ కాలంలో మాత్రం ఇలాంటి సోషల్ మీడియా లేదు. కేవలం నాటకాలు వేసి ప్రభావితమైనవారు మాత్రమే సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఏఎన్నార్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు కూడా ఇలాంటి కోవలోకే వస్తారు అని చెప్పాలి. అయితే సినిమా ఇండస్ట్రీలోకి హీరో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా తమను తాము నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడ్డారు హీరోలు.


 అయితే ఒక నాటకం కారణంగా ప్రభావితమయ్యి  తెలుగు చిత్ర పరిశ్రమకు ముగ్గురు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి స్థిరపడ్డారు అన్న విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ ముగ్గురు హీరోలు ఎవరో కాదు టాలీవుడ్ లో సోగ్గాడి గా గుర్తింపు సంపాదించుకున్న శోభన్ బాబు ప్రేక్షకులందరికీ సూపర్ స్టార్ గా మారిపోయిన కృష్ణ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మురళీమోహన్. ముగ్గురు కూడా అప్పట్లో హీరోలుగా ఎంతలా హవా నడిపించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ ముగ్గురు స్టార్ హీరోలు కూడా ఒక నాటకం ప్రభావం కారణంగానే సినిమా వైపు అడుగులు వేశారు.


 చదువుకుంటున్న సమయంలో ఇక ఈ ముగ్గురూ కలిసి నాటకం వేశారు. నాటకం పేరు పునర్జన్మ.  ఇక ఈ నాటకం ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ నాటకంలో నటించిన ముగ్గురు  ఆ తర్వాత కాలంలో ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. నాటకం సూపర్ హిట్ కావడంతో హీరోలుగా మారాలనే ఆలోచన వారి మనసులో తట్టిందట. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంతో కష్టపడి ఎవరికివారు ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ముగ్గురిలో శోభన్బాబు ఇప్పటికే దివంగతులయ్యారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ మురళి మోహన్ సినిమాలకు దూరంగానే ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: