మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ మూవీ తో భారీ బ్లాక్ బాస్టర్ బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా పోయిన సంవత్సరం క్రాక్ మూవీ విజయంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రవితేజ ఈ సంవత్సరం ఖిలాడి మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాలు నడుమ విడుదలైన ఖిలాడీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించలేకపోయింది. 

అలా ఖిలాడి మూవీ తో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన రవితేజ , ఆ తర్వాత ఈ సంవత్సరం రామారావు ఆన్ డ్యూటీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి శరత్ మండవ దర్శకత్వం వహించగా ,  రాజేష విజయన్ , దివ్యాంశ కౌశిక్మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ లుగా నటించారు. మంచి అంచనాల నడుమ రామారావు అండ్ డ్యూటీ మూవీ జూలై 27 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోక పోవడంతో ఈ మూవీ చివరకు బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ మరిబ్కొన్ని రోజుల్లో 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది. రామారావు ఆన్ డ్యూటీ మూవీ ని ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయినా సోనీ లివ్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో సెప్టెంబర్ 15 వ తేదీ నుండి తెలుగు ,  తమిళ , కన్నడ ,  మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీ లివ్ 'ఓ టి టి' సంస్థ అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: