నివేద థామస్.. ఈ సొట్ట బుగ్గల సుందరి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నవ్వితే ముత్యాలు రాలే అంతగా చాలా అద్భుతంగా తన నవ్వుతోనే ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఇక కొన్ని సంవత్సరాలు క్రితం తమిళ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె తెలుగులో హీరోయిన్గా మంచి సినిమాలలో నటించి మరింత గుర్తింపును సొంతం చేసుకుంది. స్కిన్ షో ఎక్కడా చేయకుండా చాలా పద్ధతిగా తనను తాను చూపించుకుంటూ కనిపించే హీరోయిన్లలో మొదటి స్థానంలో ఉంటుంది నివేదా థామస్.


అంతేకాదు ఏ పాత్రలో నటించిన సరే లీనం అయిపోయి నటించే ఈ ముద్దుగుమ్మ తెలుగులో నానితో రెండు సినిమాలు చేయగా రెండూ కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక ఎన్టీఆర్ కి జోడిగా జై లవకుశ సినిమాలో కూడా నటించి ఆకట్టుకుంది.. రజనీకాంత్ కి కూతురు పాత్రలో కూడా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ .. ఇటీవల పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తో వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.. ఈ సినిమా తర్వాత పెద్దగా ఈమెకు అవకాశాలు రాలేదు.  కానీ యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలకు జోడిగా నటించే అవకాశాలు వచ్చాయి. కానీ ఆఫర్లను తిరస్కరించింది .అయితే ఎందుకు అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు ఎప్పుడు దగ్గరగా ఉండే నివేదా థామస్ రెండు సంవత్సరాల క్రితం నటించిన షాకిని డాకినీ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమయ్యింది.  ఇద్దరు కలిసి ఈ సినిమాలో హీరయిన్ లుగా  నటించారు. సురేష్ బాబు ఈ సినిమాని సమర్పిస్తున్న కారణంగా ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఈ సినిమాతో నైనా ఈమె కు అవకాశాలు వస్తాయో లేదో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: