టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్న మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పాటు చేసుకున్న మంచు విష్ణు తాజా గా జిన్నా అనే మూవీ లో హీరో గా నటించాడు . ఈ మూవీలో మంచు విష్ణు సరసన సన్నీలియోన్ మరియు పాయల్ రాజపుత్ హీరోయిన్ లుగా నటించారు . ఇప్పటికే ఈ మూవీ నుండి సన్నీ లియోన్ మరియు పాయల్ రాజపుత్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లను మూవీ యూనిట్ విడుదల చేయగా ,  వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది . 

మూవీ కి సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే తాజాగా జిన్నా మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ను విడుదల చేసింది. జిన్నా మూవీ టీజర్ ని సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో మంచి విష్ణు కి ఒక వైపున సన్నిలియోన్ మరో వైపున పాయల్ రాజపుత్  ఉన్నారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ మంచు విష్ణు కు ఎలాంటి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: