కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే హీరోలకు వరుస ఫ్లాపులు రావడం ఖాయం అని చెప్పాలి. ఇప్పటిదాకా చాలామంది అగ్ర హీరోలు ఈ విషయంలో పొరపాట్లు చేసి తమ కెరియర్ ను ప్రమాదంలో పడవేసుకోగా ఇప్పుడు ఇతర హీరోలు ప్లాన్ చేసుకుంటున్న విధంగా తమ సినిమాలో ఎంపికను కూడా ప్లాన్ చేసుకుంటూ హీరోలుగా ముద్ర వేసుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకరు కళ్యాణ్ రామ్.

ఆయన సినిమాలు ఓ మోస్తరుగా మాత్రమే ఆడేవి. ఎప్పుడూ కానీ విజయాలను అందుకోకపోయేది. అలా ఆయన  పటాస్ లాంటి విజయం ఇప్పటిదాకా మరొక సినిమా రాలేదని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన బింబి సారా చిత్రం ఘనవిజయం సాధించడం నిజంగా ఆయనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది అని చెప్పాలి. ఈ ఆత్మవిశ్వాసం ఆయన సినిమాల ఎంపిక విషయంలో ఎంతో బాగా పనిచేస్తుంది అని చెప్పాలి. ఇప్పటికే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలో ఒక ప్రతిష్టాత్మకమైన సినిమాను చేస్తున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు మరొక ఆసక్తికరమైన సినిమాను ఒప్పుకోవడం విశేషం. 

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండగా ఇది ఒక విభిన్నమైన జోనర్ లో రూపొందిన సినిమా కావడం మరింత విశేషం. ఈ మధ్య ప్రేక్షకులు ముందుకు వచ్చిన బింబి సారా చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రేక్షకులను సరికొత్త లోకంలోకి తీసుకు వెళ్లి వారిని ఎంతగానో హ్యాపీ ఫీలయ్యేలా చేసిన ఈ సినిమాను మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. దీంతో ఈ సినిమా యొక్క ఓటీటీ డేట్ ఎప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.

ఇప్పటిదాకా ఈ సినిమా విడుదల కాకపోవడం పట్ల అందరూ ఆశ్చర్య వ్యక్త పరుస్తున్నారు. సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఓ టీ టీ లో వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఇప్పటిదాకా విడుదల కాకపోవడం నిజంగా వారిలో ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. అక్టోబర్ 25వ తేదీన ఈ సినిమా యొక్క ఓటీటీ నీ విడుదల చేయబోతున్నారని వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: