మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 30 వ తేదీన కాంతారా అనే కన్నడ సినిమా కన్నడ భాషలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రిషబ్ శెట్టి హీరోగా నటించగా , ఈ మూవీ కి రిషబ్ శెట్టి దర్శకత్వం కూడా వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన కాంతారా మూవీ విడుదల అయిన మొదటి రోజు , మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి కన్నడ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు కూడా దక్కాయి. ఇలా కన్నడ లో అద్భుతమైన విజయం సాధించిన ఈ మూవీ ని అక్టోబర్ 15 వ తేదీన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెలుగు లో విడుదల చేశాడు.

అప్పటికే కన్నడ లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కాంతారా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బా క్సాఫీస్ బరిలోకి దిగింది. ఇది ఇలా ఉంటే కన్నడ లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మొదటి నుండి మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ తెలుగు లో విడుదల అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ చాలా సులువుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్మలను కంప్లీట్ చేసుకుంది. ఇప్పటివరకు 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.61 కోట్ల షేర్ , 18.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసిన సరికి కాంతారా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.31 కోట్ల లాభాలను అందుకొని భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: