తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయిన నిఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే నిఖిల్ ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 18 పేజీస్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ , నిఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.  గోపి సుందర్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ ను అందించాడు. 18 పేజీస్ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా 18 పేజెస్ మూవీ యూనిట్ ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ దీపావళి సందర్భంగా ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. 18 పేజెస్ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల చేరునట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా నిఖిల్ మరియు అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కార్తికేయ 2 అద్భుతమైన విజయం సాధించింది. కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల కు పైగా కలెక్షన్ లను కొల్ల గొట్టి బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.  మరి వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండవ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని ఉంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: