అమెరికాలో ఉన్నత చదువులు చదివి సినిమాల పై మోజుతో ఇండస్ట్రీలోకి వచ్చిన అవసరాల శ్రీనివాస్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చాల డిఫరెంట్ కథలను ఎంచుకుని సినిమాలు చేస్తున్న అవసరాల ఇప్పుడు చేయబోతున్న సాహసం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. తెలుగు భాష తెలిసిన వారు అందరికీ ‘కన్యాశుల్కం’ సుపరిచితం.


ఈ నాటకం వ్రాసి 100 సంవత్సరాలు అయిపోయినా ఇంకా ఈనాటకం ఇంకా బతికే ఉంది. ఛానల్స్ ఓటీటీ లు రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలలో ఏదో ఒక ప్రాంతంలో ఇప్పటికీ ‘కన్యాశుల్కం’ నాటకాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు. నందమూరి తారకరామారావు టాప్ హీరో స్థాయికి చేరుకున్న 1950 ప్రాంతాలలో ‘కన్యాశుల్కం’ నాటకాన్ని మూవీగా తీసారు.


ఆసినిమాలో గిరీశం పాత్రలో రామారావు మధురవాణి పాత్రలో సావిత్రి జీవించారు. ఆమూవీని మళ్ళీ రీమేక్ చేయాలని చాలామంది ప్రయత్నించినప్పటికీ హీరోలు ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు ఆ సాహసాన్ని అవసరాల శ్రీనివాస్ చేయబోతున్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు త్వరలో ‘కన్యాశుల్కం’ తిరిగి సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు టాక్. త్వరలో నిర్మాణం జరుపుకోబోతున్న ఈ మూవీలో గిరీశం గా అవసరాల నటిస్తూ ఉంటే మధురవాణి పాత్రలో అంజలి నటించబోతోంది. ఇక కరకటశాస్త్రి పాత్రలో సాయి కుమార్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.


సెల్ ఫోన్స్ ఓటీటీ లు వచ్చాక తెలుగు ప్రజలు పుస్తకాలు చదవడం మానేసిన పరిస్థితులలో తిరిగి ఆనాటి కాలాన్ని మన ముందు ఉంచే గొప్ప నవలను సినిమాగా అవసరాల తీయడం ఒక సంచలనంగా మారింది. ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుంది అన్న విషయమై ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినా వచ్చే సంవత్సరం ద్వితీయార్థంలో ఈమూవీ విడుదల అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ‘కన్యాశుల్కం’ ఇచ్చే సాంప్రదాయం లేకపోయినా ప్రస్తుతం అబ్బాయిలకు సరైన అమ్మాయి పెళ్ళి కూతురుగా దొరకడం ఒక సమస్యగా మారిన నేపధ్యంలో ప్రస్తుత పరిస్థితులలో ‘కన్యాశుల్కం’ నాటకానికి చాలామంది కనెక్ట్ అవుతారు..



మరింత సమాచారం తెలుసుకోండి: