హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాల లో నటించి మెప్పించింది..లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లొ నటించి మంచి పేరు తెచ్చుకుంది.. బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలలో నటించి పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది. ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలొయింగ్ కూడా వుంది.. అనుష్క కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అనుష్క చివరిగా నిశ్శబ్దం తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది..

ఆ తర్వాత అనుష్క కొంత గ్యాప్ తీసుకున్నారు. చాలా రోజులతర్వాత ఇప్పుడు ఓ ను ప్రకటించారు. అరుంధతి తో తెలుగు ప్రేక్షకులకు జేజమ్మగా మారింది.. అలాగే.. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో దేవసేనగా అనుష్క నటన అద్భుతం. ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క.. బాహుబలి 2 తర్వాత వెండితెరపై కనిపించలేదు. చాలాకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న స్వీట్.. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పోలీశెట్టి సరసన నటిస్తోంది.


ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. కేవలం హీరోయిన్‌గానే కాకుండా.. కు తానే హీరోగా కూడా మారిపోయి విజయాలు అందుకున్నారు ఈమె. విజయశాంతి తర్వాత టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మార్కెట్ తీసుకొచ్చిన ఘనత మాత్రం స్వీటీ సొంతం. అరుంధతి నుంచి మొదలుపెడితే.. భాగమతి వరకు చాలా మాయ చేసారు జేజమ్మ.. కాగా,ఇప్పుడు లండన్ కు వెళ్లనున్నారని తెలుస్తోంది. నవీన్ పోలిశెట్టి షూటింగ్ కోసం ఆమె లండన్ పయనమవనున్నారు. దాదాపు పదిరోజుల పాటు అక్కడ షూటింగ్ చేయనున్నారు. ఈ లో అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనుందిలో ఆమె అన్విత రవళి శెట్టి అనే పాత్రలో కనిపించనుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ను రిలీజ్ చేయనున్నారు.. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: