ఇటీవల కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి మనందరికీ తెలిసిందే. కార్తికేయ 2 సినిమా అనంతరం 18 పేజెస్ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. సూర్య ప్రతాప్ దర్శకత్వం లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా అనుబంధం సంస్థ జిఏ 2 నిర్మించింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా నిఖిల్ ఆయన తదుపరి సినిమాలకి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా కార్తికేయ 3  సినిమా ఎప్పుడు మొదలవుతుంది ఎలా ఉండబోతుంది అని ప్రశ్నలు ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఆయనకి ఎదురయ్యాయి. 

దీనికిగాను ఆ ప్రాజెక్టు ఎలా అయినా రూపుదిద్దుకోవచ్చు అని  ఆయన చెప్పడం జరిగింది... ఇది కార్తికేయ 2 సినిమా సక్సెస్ అనంతరం ఈయనపై అంచనాలు మరీ ఎక్కువగా పెరిగిపోయాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.దర్శకుడు చందు ఉండేటి దానికి సంబంధించిన స్క్రిప్ట్ ను కూడా ఇప్పుడు మరింత ఉన్నత స్థాయిలో తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.అతనికి ఇప్పుడు గీత ఆర్ట్స్ లోనే ఒక సినిమా చేయాల్సిన కమిట్మెంట్ ఉందని దాని అనంతరం కార్తికేయ 3  సినిమా గురించి ఆలోచించనున్నట్లుగా తెలుస్తుంద. ఇప్పటికీ స్టోరీ లైన్ గురించి కూడా చెప్పాడని...

కొంత గ్యాప్ అనంతరం ఇద్దరం దుబాయ్ వెళ్లి అక్కడ సినిమా గురించి మాట్లాడుకునే ప్లాన్ చేస్తామని స్టోరీ లైన్ అయితే చాలా అద్భుతంగా ఉందని ఆ ప్రాజెక్టు అనేది మల్టీవర్స్ కూడా కావచ్చు లేదంటే అందులో ఎవరైనా స్టార్ హీరో కూడా మరో పాత్రలో రావచ్చు అని ఈ హీరో నిఖిల్ చెప్పాడు. ఇక ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోవడంతో కథ విషయంలో కంటెంట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైస్ కాకుండా చందు వర్క్ చేస్తున్నాడు అని అన్ని కుదిరితే మాత్రం వచ్చేయడానికి చివరిలో కార్తికేయ 3 మొదలు కావచ్చు అని నిఖిల్ చెప్పవచ్చాడు.ప్రస్తుతం నిఖిల్ కి రెండు సినిమాలు పూర్తి చేయాల్సి ఉందని వాటి అనంతరం కార్తికేయ 3  సెట్స్ పైకి వస్తుందని అన్నాడు. దీంతో కార్తికేయ 3 సినిమాపై ఆయన చేసిన కామెంట్స్ కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: