నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో బాక్సాఫీస్ వద్ద బలమైన సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు అయన కు ఎలాంటి విజయాలు లేవు. అప్పుడెప్పుడో పటాస్ సినిమా విజయాన్ని అందుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు మళ్ళీ ఇన్నిరోజులు తర్వాత ఈ సంచలన విజయాన్ని అందుకున్నాడు. తన కెరీర్ లోనే మొదటిసారి 50 కోట్ల నెంబర్ ను చూసిన ఈ హీరో ఇప్పుడు తదుపరి సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే ఆచితూచి మరీ అడుగులు వేస్తున్నాడు.

ఈ సినిమాతో వచ్చిన విజయాన్ని అదే తరహాలో కొనసాగించాలని మరింతగా మార్కెట్ను పెంచుకోవాలని కూడా ఈ హీరో అడుగులు వేస్తున్నాడు. అందుకే  కళ్యాణ్ రామ్ ప్రస్తుతం బడా బ్యానర్స్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ తో కూడా ఆయన అమిగోస్ అనే ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నుంచి లుక్ కూడా బయటకు వచ్చింది.  ఆ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు.

అతని కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ మూవీ గా నిలుస్తుంది అని చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలిసింది. ఏదేమైనా కళ్యాణ్ రామ్ లో ఈ సరికొత్త జోష్ కనపడడం విశేషం. తొందరలోనే ఈ సినిమా ను విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతుంది.  ఇక అమిగోస్ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా దాదాపు సగానికి పైగా పూర్తయింది. ఈ సినిమాకు కొత్త దర్శకుడు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ డిఫరెంట్ కథ తో సినిమా తో రావడం మాత్రమే కాదు ఈ సినిమా లో ఆయన ట్రిపుల్ రోల్ లో కనిపిస్తున్నాడట. ఇప్పటివరకు కొంతమంది నటులు మాత్రమే ట్రిపుల్ రోల్ లో నటించారు. కళ్యాణ్ రామ్

మరింత సమాచారం తెలుసుకోండి: