బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ 2018 వ సంవత్సరంలో విడుదల అయిన జీరో మూవీ తర్వాత ఇప్పటివరకు ప్రేక్షకులను సినిమాలతో ప్రలకరించ లేక పోయాడు. 2018 వ సంవత్సరంలో మంచి అంచనల విడుదల అయిన జీరో మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది. ఆఖరుగా షారుక్ ఖాన్ 2014 వ సంవత్సరంలో విడుదల అయిన హ్యాపీ న్యూ ఇయర్ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత పలు మూవీ లలో నటించిన షారుక్ ఖాన్ కు మంచి విజయం మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర లభించలేదు.

ఇది ఇలా ఉంటే తాజాగా షారుక్ ఖాన్ "పఠాన్" అనే మూవీ లో హీరో గా నటించాడు. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో జాన్ అబ్రహం ఒక కీలక పాత్రలో నటించగా సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను జనవరి 25 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఇండియాలో ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ లు కూడా ఓపెన్ అయ్యాయి. అందులో భాగంగా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ లకు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది.

ఇప్పటికే ఇండియాలో ఈ మూవీ కి 15.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారా లభించాయి. ఇది ఇలా ఉంటే ఒక్క నైజం ఏరియాలోనే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లకు 2 కోట్ల వరకు కలెక్షన్స్ దక్కాయి. ఇలా షారుక్ ఖాన్ చాలా సంవత్సరాల తర్వాత నటించిన పఠాన్ మూవీ కి ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్ లు విషయంలో ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. మరి ఈ మూవీ ఏ రేంజ్, విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: