ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీ, మలయాళం, కన్నడ , తమిళ్ వంటి భాషలలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ ని ఇటీవల నందమూరి బాలకృష్ణ చేతులు మీదుగా విడుదల చేయించారు. ట్రైలర్ తోనే ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 3వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేపట్టగా అందులో భాగంగానే ఈరోజు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు నిర్మాతలు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా న్యాచురల్ స్టార్ నాని హాజరు కాబోతున్నారు.
ఈ విషయాన్ని మరొకసారి అభిమానులతో తెలియజేస్తూ మైకేల్ భూమి టీం ఒక పోస్టర్ను రిలీజ్ చేయగా ఈ ఈవెంట్ హైదరాబాద్ జేఆర్సి కన్వెన్షన్ హాల్ ఈరోజు సాయంత్రం 6:00 నుండి జరగనుంది అని సమాచారం.మరొకవైపు ఈ మూవీ తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల చెన్నైలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇందులో విజయ్ సేతుపతి విలన్ గా నటించబోతున్నారు. దర్శకుడు గౌతమ్ మేనన్ , శరత్ కుమార్ ,వరలక్ష్మి శరత్ కుమార్ , అనసూయ భరద్వాజ్ తదితరులు మైఖేల్ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా మజిలీ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ నటిస్తోంది.