
నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా టీనా తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ఉండడం గమనార్హం. ఈ సినిమాను చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్ బ్యానర్స్ పై శరత్ చంద్ర, చంద్రు మనోహర్, అనురాగ్ రెడ్డి నిర్మించగా.. జి మనోహర్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలకు అద్భుతమైన స్పందన రాగా.. ఫిబ్రవరి 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి సన్న హాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ టీనా శిల్పరాజ్ మీడియాతో మాట్లాడుతూ చాలా విషయాలను పంచుకుంది.
టీనా శిల్ప రాజ్ మాట్లాడుతూ... నేను తెలుగు అమ్మాయినే.. మాది కూడా హైదరాబాదే.. రైటర్ పద్మభూషన్ పనిచేసిన కాస్త్యూమ్ డిజైనర్ నుంచి నాకు ఆడిషన్ కోసం కాల్ వచ్చింది . అంతకుముందు ది బేకర్ అండ్ ద బ్యూటీ కి కలిసి మేము పనిచేశాము. రైటర్ పద్మభూషణ్ కి ఆడిషన్స్ కూడా ఇచ్చాను. తర్వాత సుహాస్ గారితో లుక్ టెస్ట్ జరగగా ఈ సినిమా వస్తుందని బలంగా నమ్మాను.. ఇక నేను నమ్మినట్లుగానే ఈ సినిమా రావడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. రైటర్ పద్మభూషణ్ సినిమా ప్రేక్షకులను ఒక ఎమోషనల్ రైడ్‌కి తప్పకుండా తీసుకెళ్తుంది. ఇందులో హ్యాపీ ఎమోషన్స్ తో పాటు కామెడీ కూడా ఉంటుంది. మంచి ఫీల్ గుడ్ మూవీ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది అంటూ తన అభిప్రాయాలను పంచుకుంది టీనా.