బాలీవుడ్ స్టార్స్ షారుఖ్, దీపికా, జాన్ అబ్రహం నటినటులుగా యాక్షన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా జనవరి 25 వ తేదీన థియేటర్స్ లో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయంని సాధించింది.4 సంవత్సరాల తర్వాత షారుఖ్ ఖాన్ తెరపై కనిపించడంతో అభిమానులు థియేటర్స్ లో బాగా సందడి చేస్తున్నారు. పఠాన్ సినిమా మొదటి రోజు నుంచే చాలా భారీగా కలెక్షన్స్ వసూలు చేస్తుంది. ఇప్పటికే పఠాన్ సినిమా అయిదు రోజుల్లో ఏకంగా 542 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది.అయితే పఠాన్ సినిమాకి రిలీజ్ కి ముందు ప్రమోషన్స్, ఇంటర్వ్యూలు పెద్దగా ఏమి చేయలేదు. కానీ పఠాన్ సినిమా విడుదల అయ్యి ఇంత గొప్ప ఘన విజయం సాధించి కలెక్షన్స్ కొల్లగొడుతుండటంతో తాజాగా సోమవారం నాడు సాయంత్రం ముంబైలో సక్సెస్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో షారుఖ్, దీపికా, జాన్ అబ్రహం ఇంకా అలాగే డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ పాల్గొన్నారు. మీడియాతో ముచ్చటించి వారు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు వీరు ముగ్గురు. షారుఖ్, దీపికా, జాన్ అబ్రహం స్టెప్పులతో బాగా సందడి చేశారు.ఇంకా ఈ ప్రెస్ మీట్ లో మీడియా వాళ్ళు పలు ప్రశ్నలు అడగగా వాటికి సమాధానాలు చెప్పారు మూవీ టీం సభ్యులు.


గత కొంత కాలంగా బాయ్‌కాట్ బాలీవుడ్, బాయ్‌కాట్ మాఫియా ఇంకా కొన్ని సినిమాలని బాయ్‌కాట్ చేయడం జరుగుతుంది. ఈ బాయ్‌కాట్ ఎఫెక్ట్ బాలీవుడ్ కి చాలా కాలం పాటు చాలా గట్టిగానే తగిలింది. ఇక పఠాన్ సినిమా విడుదలకి ముందు కూడా బాయ్‌కాట్ పఠాన్, బాయ్‌కాట్ షారుఖ్ ఇంకా బాయ్‌కాట్ బాలీవుడ్ అని మరోసారి హ్యాష్ టాగ్స్ ట్రెండ్ అయ్యాయి. కానీ ఈ సారి అవి అంతగా పనిచేయలేదు. దీనిపై మీడియా షారుఖ్ ఖాన్ ని ప్రశ్నించగా మొదటిసారి షారుఖ్  ఈ బాయ్‌కాట్ వివాదంపై స్పందించాడు.ఇక షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. మేము ఎవ్వరం చెడ్డవాళ్లం కాదు. మేము చేసేది స్క్రీన్‌పై కేవలం పాత్రలు మాత్రమే. సినిమానే మాకు ప్రపంచం. సినిమాలని ఇంకా వినోదాన్ని జనాలు సీరియస్‌గా తీసుకోకూడదు. మీతో, మీ అందరితో మేము సోదర భావంతో ఉండాలనుకుంటాం. అలాగే మాలో మాకు కూడా సోదర భావం ఉంది. ఇక దీపికా అమర్ అయితే నేను షారూఖ్ అక్బర్, జాన్ ఆంటోనీ ముగ్గురం అమర్ అక్బర్ ఆంటోనీ అని అన్నారు. ఇది ఒక సినిమా. ఇలాగే కలిసి మెలిసి అందరితోనూ ఉంటాం. ఇంకా మేము ఎవ్వరిని ద్వేషించం. ఇప్పుడున్న యువతకు అనుగుణంగా మారేలా ట్రై చేస్తున్నాం అని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: