బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై మరోసారి ట్రోలర్స్ రెచ్చిపోయారు. బీ టౌన్ లో ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలిచే సల్మాన్ ఖాన్ లేటెస్ట్ గా తన మూవీ సాంగ్ తో వార్తల్లో నిలిచాడు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం చేస్తున్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలోని ఒక సాంగ్ రిలీజైంది. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలోని నైయో లగ్దా సాంగ్ లో సల్మాన్ స్టెప్స్ పై ట్రోల్స్ చేస్తున్నారు. కిందకు వంగి పైకి లేస్తూ సల్మాన్ ఖాన్ వేసిన ఆ స్టెప్ పై ట్రోల్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

డ్యాన్స్ చేయాలంటే సౌత్ హీరోల తర్వాతే.. బాలీవుడ్ హీరోలు మన వాళ్లకు పోటీ ఇవ్వలేరు. అక్కడ హృతిక్ రోషన్, రణ్ వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్ ఇలా వీరు కొంత మేరకు ట్రై చేసినా మిగతా వారంతా కూడా డ్యాన్స్ లో పెద్దగా అదరగొట్టరు. ఈ క్రమంలో లేటెస్ట్ సల్మాన్ ఖాన్ స్టెప్ పై ట్రోల్స్ మొదలయ్యాయి. అయితే వీటిపై చిత్రయూనిట్ కానీ, సల్మాన్ టీం కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. తను చేసిన ప్రయత్నం అందరికి నచ్చాలన్న ఆలోచన లేదు కాబట్టి సల్మాన్ అండ్ టీం సైలెంట్ గా ఉన్నారు.

సల్మాన్ తో పాటుగా ఈ సినిమాలో మన విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నారు. సినిమాలో వెంకటేష్ పూజా హెగ్దేకి అన్న పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. ఈమధ్యనే సల్మాన్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో కెమియో రోల్ చేశారు. అయితే కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమాలో వెంకటేష్ ది గెస్ట్ రోల్ కాదు.. సినిమాలో వెంకీది ఇంపార్టెంట్ రోల్ అని తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఎలాగు ఇప్పుడనీ పాన్ ఇండియా సినిమాలే అవుతున్నాయి కాబట్టి హిందీ సినిమాలు కూడా అదే బాట పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: