గత కొంతకాలం నుంచి బాలయ్య వరుసగా సూపర్ హిట్ల సాధిస్తూ దూసుకుపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. 60 ఏళ్ల వయసులో కూడా నిర్విరామంగా సినిమా షూటింగ్లలో పాల్గొంటూ యువ హీరోలకు సైతం పోటీ ఇస్తున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే గత ఏడాది బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా బాలయ్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది అని చెప్పాలి. ఇక ఏడాది సంక్రాంతికి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీర సింహారెడ్డి సినిమాతో మరో హిట్టును ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య.



 ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు అనే విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి అంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. దీంతో బాలయ్యను ఈ దర్శకుడు ఎలా చూపించబోతున్నాడు అని తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అంతేకాదు ఇక బాలయ్య కూతురుగా యంగ్ బ్యూటీ శ్రీలీలా కూడా నటిస్తుంది అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే అనిల్ రావిపూడి బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న  సినిమాలో ఇక మరో హీరోయిన్ కూడా నటించబోతుందట. బాలీవుడ్ హాట్ బ్యూటీ నోర ఫతేహి బాలయ్య సినిమాలో నటించబోతున్నారని తెలుస్తుంది. అయితే హీరోయిన్ పాత్రలో కాదు నెగటివ్ షేడ్స్ ఉండే పాత్ర పోషించబోతుందట. ఇక ఈ అందాల ముద్దుగుమ్మ పవర్ఫుల్ బాలయ్యతో ఒక ఫైట్ సీన్ కూడా చేయబోతుందని తెలుస్తుంది. ఈ ఫైట్ సీన్ సినిమాకే హైలెట్ గా మారిపోతుందట. నోరా ఫతేహి   గురించి త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన చేయబోతున్నారు అన్న టాక్ మాత్రం ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: