నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం “ అఖండ 2 ” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ ఇప్పటికే డిసెంబర్ 5న సినిమా విడుదల కానున్నట్టు ప్రకటించడం అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపింది. ఇక బాలయ్య నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే, తన 111వ సినిమాను “ వీరసింహా రెడ్డి ” దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్నట్టు అధికారికంగా ఖరారైంది. ఈ కాంబినేషన్ ఇప్పటికే మాస్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నందున, మళ్లీ ఇద్దరి కలయికపై భారీ అంచనాలు ఉన్నాయి.


మేకర్స్ ఈ దసరా కానుకగా ఫ్యాన్స్‌కు సూపర్ అప్డేట్ ఇచ్చారు. వచ్చే అక్టోబర్ 24న ఈ భారీ ప్రాజెక్ట్ ముహూర్త కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తారు. దీంతో బాలయ్య అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అఖండ 2 తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్ మాస్ ఎంటర్టైనర్‌గా, అలాగే బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్లుగా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాకు మ్యూజిక్ మాంత్రికుడు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే అఖండ, వీరసింహా రెడ్డి వంటి సినిమాల‌కు థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాలయ్య ఇమేజ్‌ను మరింత ఎలివేట్ చేసింది. అందుకే ఈ సారి కూడా థమన్ మ్యూజిక్ సినిమాకు స్పెషల్ హైలైట్ కానుంది.


బిగ్ స్కేల్‌లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ను వృద్ధి సినిమాస్ వారు నిర్మిస్తుండ‌గా... బాల‌య్య కెరీర్‌లోనే బిగ్ స్కూల్ బ‌డ్జెట్‌తో నిర్మించే ప్లానింగ్ ఉంది. ఫైన‌ల్‌గా డిసెంబర్‌లో అఖండ 2తో అలరించబోతున్న బాలయ్య, వెంటనే తన 111వ సినిమాతో మాస్ ఫీస్ట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. దీంతో ఈ దసరా బాలయ్య అభిమానులకు నిజంగా డబుల్ పండుగగా మారింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: