
కన్నడ యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి రూపొందించిన తాజా సినిమా “కాంతార చాప్టర్ 1” కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ రోజు వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అయిన ఈ సినిమా ప్రారంభం నుంచే భారీ హంగామా క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే టికెట్ బుకింగ్స్‌లోనే ఈ సినిమా తన రేంజ్ ఏంటో చూపించేసింది. బుక్ మై షోలో కేవలం గంటలోనే 87 వేల టికెట్లు సేల్ అవ్వడం ఇండస్ట్రీ వర్గాలకే షాక్ ఇచ్చింది. ఈ ఒక్క ఫిగర్ చూసినా సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారో అర్థమవుతుంది. ఇది రిషబ్ శెట్టి క్రియేట్ చేసిన బ్రాండ్ విలువకు నిదర్శనం. కాంతార మొదటి భాగం అందించిన అనుభూతి, నేటివిటీ మూడేళ్లు అవుతున్నా.. ప్రేక్షకుల మదిలో అంతగా నాటుకుపోవడంతో, ఈ ప్రీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్నంటాయి.
ఈ సినిమాలో రిషబ్ శెట్టి శక్తివంతమైన పాత్రలో కనిపించనుండగా, అందాల భామ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. వారి కెమిస్ట్రీ ఇప్పటికే పోస్టర్స్, ట్రైలర్స్‌లో బాగానే కనెక్ట్ అయ్యింది. మరోవైపు సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ అందించిన సౌండ్‌ట్రాక్ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యింది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పాన్ ఇండియా స్థాయిలో దుమ్ము దులిపేస్తూ రీజనల్ లాంగ్వేజెస్‌లోనూ అదిరిపోయే వసూల్లు రాబడుతోంది. మొదటి రోజు నుంచే ట్రెండ్ సెట్ చేస్తోన్న ఈ సినిమా, రాబోయే రోజుల్లో కలెక్షన్స్ పరంగా కూడా రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.