సౌత్ నుంచి బాలీవుడ్‌కి వెళ్ళి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన భామలు చాలామందే ఉన్నా, బెంగుళూరు నుంచి వెళ్ళిన వారిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఐశ్వర్యరాయ్ మరియు దీపికా పదుకొణే. ఈ ఇద్దరూ బాలీవుడ్‌లో అగ్రస్థానం దాకా చేరుకుని, దేశవ్యాప్తంగా క్రేజ్ క్రియేట్ చేసినవారే. ఇప్పుడు అదే రూట్‌లో మరో భామరష్మిక మందన్నా తనదైన ముద్ర వేస్తోంది. మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న ఐశ్వర్యరాయ్‌కి సినిమా రంగం పెద్ద సమస్యే కాలేదు. ఇరువార్తో కోలీవుడ్‌లో పరిచయం అయిన ఆమె, ఔర్ ప్యార్ హో గయాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. జీన్స్తో తమిళంలో సంచలనం సృష్టించిన ఆమె, తర్వాత బాలీవుడ్‌లో ఒకదానిపై మరొక హిట్ కొట్టి, అగ్ర హీరోయిన్‌గా వెలిగింది. అనంతరం అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకుని హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే స్థిరపడిపోయింది.


దీపికా ప్రయాణం మరింత వేగంగా సాగింది. కన్నడలో ప్రారంభమైన ఆమె కెరీర్, ఓం శాంతి ఓంతో షారుక్ ఖాన్ జోడీగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వగానే ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ సాధించింది. అటుపై వెనక్కి తిరిగి చూడలేదు. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ, నేటి బాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్‌గా నిలిచింది. రణవీర్ సింగ్‌తో ప్రేమ వివాహం చేసుకుని వ్యక్తిగత, వృత్తిపరంగా స్టేబుల్‌గా ఉన్నది. ఇద్దరి తర్వాత బెంగుళూరు నుంచి బాలీవుడ్ వైపు అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నానే. కన్నడలో లాంచ్ అయి, టాలీవుడ్‌లో రికార్డ్ స్థాయి స్టార్‌డమ్ సంపాదించింది. చాలా తక్కువ సమయంలోనే “నేషనల్ క్రష్” అనే టైటిల్ తెచ్చుకుంది. టాలీవుడ్ సక్సెస్‌లతో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ దక్కించుకుంది.


బాలీవుడ్‌లో మొదట గుడ్ బై, మిషన్ మజ్ను లాంటి చిత్రాలతో పెద్ద ఇంపాక్ట్ చూపలేకపోయినా, ఒక్క యానిమల్‌తో మాత్రం సీన్ మార్చేసింది. రణబీర్ కపూర్ సరసన నటించి, దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ ఇమేజ్ తెచ్చుకుంది. ఆ వెంటనే చావాతో హ్యాట్రిక్ విజయానికి దగ్గరగా వెళ్లింది. సికిందర్ పరాజయం అవ్వడంతో పెద్దగా ప్రభావం చూపకపోయినా, రష్మిక క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఐశ్వర్యరాయ్ – దీపికా – రష్మిక అనే మూడు భామలు ఇప్పుడు బాలీవుడ్‌లో వేర్వేరు తరాలుగా ఏలుతున్నారు. అందం, నటన, క్రేజ్… ఈ మూడు మిళితమై రష్మికను నేటి బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేసులో ముందుకు నడిపిస్తున్నాయి. స్టార్ హీరోలు కూడా ఆమెతో నటించడానికి క్యూలో నిలబడుతున్నారు. మొత్తానికి, బెంగుళూరు నుంచి వచ్చిన మరో భామరష్మిక మందన్నా ఇప్పుడు బాలీవుడ్‌ను షేక్ చేస్తూ, నేషనల్ లెవెల్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదుగుతున్న దారిలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: