బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి ఆయన స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షారుక్ ఇప్పటికే ఎన్నో భారీ బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి ప్రపంచ వ్యాప్తంగా హీరో గా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా హీరోగా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న షారుఖ్ కొన్ని సంవత్సరాల క్రితం వరుస పరాజయాలు ఎదురు అవడంతో కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు.

అలా కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న షారుక్ తాజాగా పఠాన్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటి దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా ... బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి జాన్ అబ్రహం ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంది.

దానితో ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి. ఈ సినిమా హిందీ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. తెలుగు లో కూడా ఈ మూవీ కి సూపర్ కలెక్షన్ లు లభించాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఏప్రిల్ 25 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ హిందీ , తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: