పవన్ నటిస్తున్న సినిమాల స్పీడ్ చూసి అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ‘జనసేన’ కార్యక్రమాలలో బిజీగా ఉంటూనే ‘వినోదయసితం’ రీమేక్ షూటింగ్ లో పాల్గొంటూ పవన్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను ఇంచుమించు పూర్తి చేసాడు అని అంటున్నారు. ఈమూవీ షూటింగ్ ను పూర్తిచేసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా హరీష్ శంకర్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ స్పాట్ కు వచ్చేనెల నుండి జాయిన్ అవుతాడని అంటున్నారు.


ఈసినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారంలోకి వచ్చింది. విజయ్ హీరోగా నటించిన ‘తెరి’ మూవీకి రీమేక్ గా తయారు కాబోతున్న ఈమూవీ కథలో హరీష్ శంకర్ చాల మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈమూవీ ఒరిజనల్ లో హీరోకు ఒక కూతురు ఉంటే ఆకూతురు పాత్రను పక్కకుపెట్టి హరీష్ శంకర్ మూవీలో హీరోకి ఒక కొడుకు ఉండేలా మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.


ఒరిజనల్ తమిళ సినిమాలో హీరోకు కూతురు ఉంటే తెలుగు రీమేక్ లో పవన్ కు ఒక టీనేజ్ కొడుకు ఉండేడట్లుగా కథలో మార్పులు జరిగాయి అంటున్నారు. గతంలో హరీష్ శంకర్ పవన్ తో తీసిన ‘గబ్బర్ సింగ్’ మూవీ హిందీ మాతృక అయిన ‘దబాంగ్’ మూవీకి ఎలాంటి మార్పులు చేసారో ‘వినోదయసితం’ విషయంలో కూడ అలాంటి మార్పులు చాల జరిగాయి అని అంటున్నారు.


హరీష్ శంకర్ చేసిన మార్పులలో ఈమూవీలో పవన్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో కాలేజీ ప్రొఫిసర్ గా కనిపిస్తాడని అంటున్నారు. అంతేకాదు ‘గబ్బర్ సింగ్’ ఘన విజయానికి తనవంతు పాత్రను పోషించిన ‘కేవ్వుకేక’ పాట స్థాయిలో ఇప్పటి సరికొత్త ట్రెండ్ కు అనుగుణంగా ఒక ఐటమ్ సాంగ్ ను కూడ ఈ రీమేక్ లో ఉండబోతోంది అన్న వార్తలు కూడ వస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన హరీష్ శంకర్ ఈమూవీలో పవన్ కళ్యాణ్ కొడుకుగా ఎవరు బాగుంటారు అని ఆలోచిస్తూ పవన్ కొడుకుగా నటించగల వ్యక్తికోసం హరీష్ శంకర్ నూతన నటీనటులతో ఆడిషన్స్ జరుగుతున్నట్లు టాక్..





మరింత సమాచారం తెలుసుకోండి: