బాలీవుడ్ స్టార్స్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, హాట్ బ్యూటీ దీపికా పదుకొనే జంటగా యాక్షన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద దర్శకత్వంలో వచ్చిన పఠాన్ సినిమా దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో 1030 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి షారుఖ్ ఖాన్ చాలా గ్రాండ్ గా కంబ్యాక్ ఇచ్చాడు.ఈ సినిమాతో గత కొన్నాళ్లుగా వరుసగా ఎన్నో భారీ ఫ్లాప్స్ చూస్తున్న బాలీవుడ్ కి కూడా హిట్ సినిమా ఇచ్చాడు షారుఖ్ ఖాన్. ఈ సినిమా విజయంతో బాలీవుడ్ అంతా కూడా ఎంతగానో పండగ చేసుకుంది.ఇన్ని రోజులు థియేటర్స్ లో ఒక రేంజిలో సందడి చేసిన పఠాన్ సినిమా ఇక ఇటీవలే  50 రోజులు కూడా పూర్తి చేసుకుంది. ఇన్ని రోజులు థియేటర్స్ లో రికార్డులు బద్దలుకొట్టిన పఠాన్ సినిమా ఇప్పుడు ఓటీటీలో రికార్డులు సృష్టించడానికి రెడీ అయింది. ఇటీవల చాలా సినిమాలు విడుదల అయిన నెల రోజులలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.


పఠాన్ సినిమా పెద్ద సినిమా అవ్వడం, భారీ హిట్ కొట్టడం ఇంకా భారీ కలెక్షన్స్ రాబట్టడంతో  50 రోజులు అయ్యేవరకు వరకు ఆగింది. ఇప్పుడు పఠాన్ సినిమాని ఉగాది సందర్భంగా మార్చ్ 22 వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేయబోతున్నారు.అయితే గతంలోనే పఠాన్ సినిమా తమ ఓటీటీలో రాబోతున్నట్టు అమెజాన్ ప్రకటించినా డేట్ మాత్రం ఇంకా చెప్పలేదు. తాజాగా ఉగాది సందర్భంగా మార్చ్ 22 వ తేదీ నుంచి పఠాన్ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవ్వబోతుందని అధికారికంగా ప్రకటించారు. పఠాన్ సినిమా హిందీ, తమిళ్ ఇంకా అలాగే తెలుగు భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవ్వనుంది. దీంతో షారుఖ్ ఖాన్ అభిమానులు మరోసారి పఠాన్ సినిమాని చూడటానికి రెడీ అయిపోయారు. థియేటర్స్ లో 1000 కోట్లు కొల్లగొట్టిన పఠాన్ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డులు సాధిస్తుందో ఇక చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: